S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒంటికాలితో ఈదే హంస

అలనాటి రాజహంసల మాట కాదుగానీ..ఈనాటి హంసల(స్వాన్)కూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నీళ్లలో ఈదేటపుడు అవి ఒంటికాలితోనే వెళతాయి. ఓ కాలును మడిచి వీపుపై పెట్టి ఈతకొడతాయి. మగహంసలకు పురుషాంగం ఉంటుంది. పక్షుల్లో ఈ ప్రత్యేకత వీటికే ఉంది. సాధారణంగా నేలపైకి వచ్చి ఆహారం తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడవు. వీటికి కోపం ఎక్కువే. ప్రమాదం ఉందని తెలిస్తే...అవి ఎదురుదాడి చేస్తాయికూడా. ప్రతీ హంసకు కనీసం 25వేల ఈకలు ఉంటాయి. తెల్లహంసలు దక్షిణ అమెరికాలోను, నల్లహంసలు ఆస్ట్రేలియాలోనూ కన్పిస్తాయి. గంటకు 60 కి.మీ దూరం ఎగురగల ఈ పక్షులు ఎక్కువదూరం ప్రయాణించవు. అన్నట్లు మనుషులను చూసిన వెంటనే వారు తమపట్ల దయతో ఉన్నారా, వారినుంచి ముప్పు ఉందా అన్నది చూసి పోల్చుకోగల శక్తి వాటికి ఉందట. ఇవి ఒకసారి జతకడితే జీవితాంతం కలిసే ఉంటాయి.

ఎస్.కె.కె.రవళి