S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన్ కీ బాత్

వేదిక మీద స్వంత గోడు అగ్నిపర్వతం బద్దలయ్యింది
లావా హాలంతా వ్యాపిస్తోంది!
వృద్ధులు, పురుషులు, స్ర్తిలు, చిన్నపిల్లలతో సహా
హాల్లో అందరికీ చెవుల గొంతులు ఎండిపోతున్నాయి
ఒక్కటంటే ఒక్క చుక్క మంచి మాటల నీరు లేదు
ఒక్కటంటే ఒక్క చుక్క అర్థమయ్యే మాట, అర్థవంతమైన మాట లేదు
చెవుల నోళ్లు పిడచ గట్టుకుపోతుంటే
ఆ పై వాడు పట్టించుకోడు
గుండెలు తపతప కొట్టుకుంటున్నాయి
ఆవేదన పడుతున్నాయి అలసిపోతున్నాయి
జనం కోసం, సమాజం కోసం
ఒక్కటంటే ఒక్క చల్లటి మాట
జనం దాహం తీర్చే ఊట, ఏదీ? ఎక్కడ?

వేదిక మీది వక్త స్వోత్కర్ష
గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే
చల్లని ఏసీ హాల్లో బందీలై చెమటలు కక్కుతున్నారు
అటు బయట మండే ఎండలోకి వెళ్లి
మాడుకాల్చుకోలేక
ఇటు వేదిక మీది వక్త ‘ఆత్మాహుతి’ చూసి తట్టుకోలేక
తల్లడిల్లుతున్న శ్రోతల మధ్య నేను
ఒక అనామకుడిని, అమాయకుడిని

సమయము, సందర్భమూ చూసుకోకుండా
ప్రేక్షకుల మనసులు కాదు,
కనీసం ముఖాలు కూడా చదవకుండా
ఆ వక్తగారు రైలింజన్‌లా
హోరుమని కూత పెడుతూ ఉంటే
కళ్లు బైర్లుగమ్మి, మెదడు మొద్దుబారిపోయింది కదా?
ఇదిగో ఇలాంటి వారే సాహిత్యాన్ని ఆట పట్టిస్తుంటే
తట్టుకోలేకే యువతరం భీతిల్లిపోతున్నదేమో
క్రికెట్ గ్రౌండ్‌లలో, నెట్ బ్రౌసింగ్ సెంటర్లలో
తలలు దాచుకుంటున్నారేమో!
తన క్రియా శూన్యత్వాన్ని
గంభీరోపన్యాసం కింద దాచేవాడే కదా
నేటి ‘ప్రధాని’ వక్త?
సనాధ్యక్షులైనా లేచి, ఆయనగారిని అడ్డుకుంటే
మేమంతా బతికి బలుసాకు తింటాం!
కాస్తంత ఊపిరి పీల్చుకుంటాం!!

-దేవరాజు మహారాజు 9908633949