S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవన పయనంలో ఘర్షణలు.. సంఘర్షణలు

ఘర్షణ, సంఘర్షణ - రెండూ సెల్ఫ్ డెప్రెషన్‌కి దారితీసేవే. మనం కొన్నికొన్నింటిని యధాలాపంగా తీసుకుంటాం కానీ ఎంతటి చిన్న విషయంలోనైనా, పెద్ద విషయంలోనైనా మన అంతర జీవితం, బాహ్య జీవితం భాగస్వామ్యం అవుతూనే ఉంటాయి. అందుకే జీవన పయనంలో ఇన్ని ఘర్షణలు, సంఘర్షణలు. ఫలితం సానుకూలమైతే ఆనందం, ప్రతికూలం అయితే విషాదం. అంతెందుకు ‘నిమిత్తాని చ పశ్యామి విపరీతాని’ అని అర్జునుడు కృష్ణుడితో ‘విపరీతాలు’ అని అనటంలో భవిష్యత్తును అర్జునుడు అనుకూలంగా కాక ప్రతికూలంగా చిత్రించుకోవటం ఆతడి మానసిక దౌర్బల్యమే. అసలు కార్యాచరణకు దిగక ఇలా ప్రతికూలంగా ఆలోచించటం ఎటువంటి పరిస్థితిలోనూ తగదు. ఎట్టి నిర్ణయాలైనా కార్యాచరణకు పూర్వమే ప్రణాళికా రచనలోనే జరగాలి. ఒకవేళ మనం తప్పుకుందామనుకున్నా తప్పుకోలేని పరిస్థితి నెలకొని ఉంటుంది.
సహించలేని ఒక ఆలోచన మనల్ని అన్ని వైపుల నుండి వెనక్కి లాగుతుంది. అవయవాలు కృంగిపోతాయి. యుద్ధానంతరం ఆత్మీయుల్ని చూడలేనన్న ఆలోచన అర్జునుడి నాలుక తడారిపోయేలా చేసింది.. దేహం వొణికింది.. గగుర్పాటు కలిగింది.. చేతిలోని అస్త్రాలు జారిపోయాయి... లో నుండి సెగలు.. నిలబడలేని అశక్తత.. జరగబోయే విపరీతాలు కళ్ల ముందు కదలాడాయి. ఇది ఒక్క అర్జునుడి స్థితే కాదు.. కార్యనిమగ్నమయిన తరుణంలో ప్రతికూల ఆలోచనలు పొటమరించినపుడు అందరకూ కలిగేదే. ఇలా శారీరకంగా, మానసికంగా కృంగిపోయి సెల్ఫ్ డెప్రెషన్‌కి గురి అయిన దానికి సంకేతమే.
విజయాన్ని ఆశించే, రాజ్యాధికారాన్ని కోరుకునే, భోగాలను అభిలషించే అర్జునుడు యుద్ధ్భూమిలో అడుగుపెట్టాడు. మనమూ అంతే గంపెడు ఆశలతో పనిలో నిమగ్నం అవుతాం. అయితే వివేచన ఏ క్షణాన తలకెక్కినా మరోమారు మనల్ని మనమే సమీక్షించుకో గలుగుతాం. అటువంటి వివేచనతోనే అర్జునుడు ఆత్మీయుల్ని పోగొట్టుకోవటమే కాదు కులక్షయాన్ని సైతం పసికట్ట గలిగాడు.. కులధర్మం నశించటాన్ని అంచనా వేయగలిగాడు.. అధర్మ వర్తనాన్ని ఊహించగలిగాడు.. సనాతన ధర్మం రూపుమాసిపోతుందని వ్యాకులపడ్డాడు.. మొత్తానికి అర్జునుడి ఈ చర్యలు, ఆలోచనలు విషాద సంకేతాలు. ఇటువంటి ఆలోచనాధారతో ఎంతటి ధీరోదాత్తులమైనా మనం సెల్ఫ్ డెప్రెషన్‌కి గురి కావలసిందే. కాబట్టి ఫలితాలపై మనస్సు లగ్నమైతే, జరిగే నష్టాన్ని ఊహించుకుంటే వెనుకపాటే తప్ప ముందడుగు సాధ్యంకాదు.
అసలు కార్యమగ్నమైనాక మనలో చోటు చేసుకునే ఈ ఆలోచనాధారకు కారణం కార్యాచరణకు పూర్వం మనం అత్యంత ఆసక్తితోను, తొందరపాటుతోను ఉండటంవల్ల విచక్షణ కొంత వెనకడుగు వేస్తుంది. ఒక విధంగా కళ్లు మసకేస్తాయి.. దృష్టి ఒకవైపే ఉంటుంది.. రెండో వైపున ఏమున్నదన్న ఆలోచన సాగదు. ‘టూ మచ్ యాంగర్ వితిన్ అండ్ ఎక్స్‌ట్రీమ్ ఈగర్‌నెస్ క్రియేట్ ఎ ఫాగ్’ అంటే అర్థం ఇదే. నిజం చెప్పుకోవాలంటే ఇటు పాండవులు అటు కౌరవులు ఈ తెరల మధ్యనే కురుక్షేత్రంలోకి అడుగుపెట్టి యుద్ధ సన్నధులయ్యారు.
యుద్ధ భూమిలో దేహబలిమి పాండవులలో భీముడిది, కౌరవులలో దుర్యోధనుడిది. వీరిద్దరి మధ్యనే భౌతిక అంటే శారీరక బలిమితో పోరు జరిగి ఉంటే భారత కథ ఎలా ఉండేదో? కురుక్షేత్ర సంగ్రామ ఫలితం ఎలా ఉండేదో? కాని కృష్ణ ప్రవేశంతో, కృష్ణోపదేశంతో కురుక్షేత్రం భౌతికాన్ని దాటి మానసికాన్ని ఆక్రమించింది. అర్జునుడి మనసును తాత్విక క్షేత్రం చేసింది. అందుకే భగవద్గీతను ‘సైకలాజికల్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్’గా చెప్పుకోవచ్చు. చివరికి పోరుభూమి ప్రజ్ఞాన పొత్తంగా తయారైంది.
* * *
మనిషిని చరమాంకం దాకా ‘అహం’ వదలదు. ఏదో ఒక మాయ అహాన్ని కాపాడుతూనే ఉంటుంది. ఎంతటి మహాత్ములైనా ఈ రక్షణా వలయంలో పడి అహంభావులుగానే భావిస్తుంటారు. ఇలా భాసిస్తూనే అప్పుడప్పుడూ అభాసుపాలవుతుంటారు. నిజానికి ఎంతటి వారైనా అసూయాగ్రస్తులు ఎందుకు అవుతున్నారు? తమను తామే ఎందుకు కీర్తించుకుంటున్నారు? అంటే అహంతో స్నేహిస్తుండటం వల్లనే. అందుకే అహానికి ఆటంకం ఏర్పడినప్పుడు సహించలేక పోతున్నాం. కాబట్టి విచక్షణతో మనం జ్ఞాన సంపన్నమైతే తప్ప విషాద జీవనం నుండి బయటపడలేం.
ఒక చిలిపి ఆలోచన - అర్జునుడు అన్నట్టుగా తాతలు, తండ్రులు, సోదరులు, స్నేహితులు, సన్నిహితులు, ఆత్మీయులు - ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలితే మన అహం తృప్తి నిస్తుందా? అహానికి అస్తిత్వం సంప్రాప్తిస్తుందా? కాబట్టి మనల్ని తెలిసినవారి మధ్యనే మన అహానికి అస్తిత్వం. అప్పుడే మన అహానికి అందలం.. మనకు ఆనందం.
కాబట్టి అందరూ ఉన్నచోటనే మన అహంకారానికి పూర్ణాయుష్షు అన్న మత్తులో ఉన్నంతకాలం మనం సందిగ్ధతలో ఉన్నట్లే... సంఘర్షణకు తెరతీస్తున్నట్లే.
He who thinks he has done wrong may not just/ Torment himself, he may seek to put things/ Together again. In this rather evident/ possibility, we not only have in general/ A connection between the emotions and the/ moral life, we also have something that/ illustrates the point... About the interpretation/ of a set of actions in terms of an emotional/ structure #I Bernard Williams అన్నట్లుగా అర్జునుడ్ని ‘సరి’ చేయటానికే కృష్ణుడు సమాయత్తం కావటమే భగవద్గీత.. వెరసి కృష్ణగీత.
* * *
పొటమరించిన విషాదాంశ ‘డిస్టర్టింగ్ వాక్యూమ్’గా తయారవుతుంది. సెల్ఫ్ డెప్రెషన్‌కి దారితీస్తుంది. కురుక్షేత్రంలోని అర్జునుడు దీనికి నిలువెత్తు రూపం... భగవద్గీతలోని మొదటి అధ్యాయమే దీనికి అక్షర సాక్ష్యం.
అర్జునుడి రథంలా మన మనస్సూ ముందుకు ఉరుకుతుంది... రథాశ్వాలలా మన ఇంద్రియాలూ దౌడు తీస్తాయి. ఎంతలా డ్రైవింగ్ వచ్చినవాడైనా వెనక సీట్ల కూర్చున్నవారి ఇష్టానుగుణంగానే బండి నడపవలసి ఉంటుంది.
అందుకే అమితాసక్తితో ఉన్న అర్జునుడి ఆలోచనలకు అనుగుణంగా కృష్ణుడు తన వివేక సంపన్నతను పక్కనపెట్టి అర్జునుడికి ఇష్టమైన రీతిన రథాన్ని ఇరుసేనల మధ్యన నిలిపాడు.. అర్జునుడు ఇరకాటంలో పడ్డాడు.. ఆత్మగ్లాని ప్రాప్తమైంది. జు