S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎకిడ్నా స్పెషాలిటీ ఇదీ...

చీమలు, చెదలు ఇష్టంగా తినే ఎకిడ్నాలు ఆస్ట్రేలియా, న్యూగినియాలో మాత్రమే కన్పిస్తాయి. పొడవైన ముక్కు, పొట్టి ముక్కుతో రెండు రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. వీటిలో పొడవుముక్కు ఎకిడ్నాలు న్యూగినియాలో మాత్రమే కన్పిస్తాయి. పిల్లుల్లా ఇవి తెలివైన జీవులు. ముక్కు, నోటితో ఒకేసారి శబ్దం చేసి ఆహారాన్ని కనిపెట్టడం వీటి స్పెషాలిటీ. కీటకాలు, చిన్నచిన్న క్రిముల్లో ఉండే ఎలక్ట్రిక్ తరంగాలను గుర్తుపట్టి ఇవి దాడి చేస్తాయి. చాలా క్షీరదాలకు భిన్నంగా ఇవి గుడ్లను పెట్టి పిల్లలను పొదుగుతాయి. కంగారూల మాదిరిగా తల్లి తన ఉదరంపై ఉండే సంచీలో గుడ్డును పెట్టుకుని పొదుగుతుంది. ఆ తరువాత దాదాపు ఏడు నెలలవరకు పాలిచ్చి పెంచుతుంది. వీటి శరీరంపై ఉష్ట్రోగ్రతను నియంత్రించే మెత్తటి బొచ్చు, శత్రువులనుంచి రక్షణనిచ్చే ముళ్లు ఉంటాయి. ఇవి కనీసం 50 ఏళ్లపాటు జీవిస్తాయి.

ఎస్.కె.కె.రవళి