S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ-చెట్టు

అమ్మ మాతృత్వానికి ప్రతీక
చెట్టు పర్యావరణానికి పతాక
అమ్మ అమృత ఔషధి...
తాగించి మనిషిని చేస్తే...
చెట్టు నిరంతరం
ప్రాణ వాయువునందించే
జీవన నేస్తం...
అమ్మ హాయి నిదురకు
బొమ్మరిల్లు కతలు చెబితే..
చెట్టు చందమామను
కొమ్మలపై దింపి చల్లగాలితో
జోలపాట పాడుతుంది...
అమ్మ తొలి గురువై
అక్షరాలు దిద్దిస్తే...
చెట్టు ఊయలై
పద్యాలు వల్లె వేయిస్తుంది..
అమ్మ బడి బాటకు
ఎండలో గొడుగు పడితే
చెట్టు అటూ ఇటూగా నిలిచి
నీడనిచ్చింది...
అమ్మ కడుపునిండా...
అన్నం పెట్టే అనురాగ దేవత
చెట్టు ఆడకుండానే..
అమృత ఫలాలనిచ్చి
ఆకలి తీర్చే ఆత్మీయ నేస్తం...
అమ్మ పిల్లల ఎదుగుదలలో
ఆనంద భాష్పాలు రాల్చి
మురిసిపోతే...
చెట్టు పూలను కురిపించి
తరిస్తుంది...
అమ్మ దైవ ప్రతినిధి..
చెట్టు హరిత ప్రతినిధి..
రెండూ కూడా
భువిపై వెలసిన మమతల
మణిహారాలు.

-మడిపల్లి హరిహరనాథ్
9603577655

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655