S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎవరు?

మట్టి నుండి పుట్టిన మనిషి...!!
మరణాన్ని త్యాగం చేసే మనిషి
మట్టిలో కలిసే మనిషి
మానవత్వానికి దూరంగా ఉన్నాడు
మనసుని చంపేసి... మనీకి దగ్గరయ్యాడు
చెదిరిన, నలిగిన హృదయంతో చిక్కిపోయాడు.
చరిత్ర గర్భంలో చెడ పుట్టాడు
బీదల బ్రతుకు కన్నీళ్లు కురిసే వర్షంలో
బాధల బరువులు మోసే జీవితాల్లో
బంధాల బీడు భూముల క్షేత్రంలో
భారంగా మారిన మృతకళేబరం మనిషి
తన నయనాలు పండుగలు వీక్షిస్తాయి
ఆనందాలు కాంక్షిస్తాయి
తన నయనాలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తాయి
పాడుబడిన, మోడువారిన, పేదలైన, దీనులైన
జీవితాలను త్యజిస్తాయి
పుణ్య ధరిత్రి నుండి ప్రసవించిన మనం
పుణ్యక్షేత్ర ప్రస్థానాలకు పచ్చనోట్లు పరిచే మనం
పేదల, పీడితుల బ్రతుకుల్లో వెలుగులు నింపగలమా..?

-కోనే సతీష్‌కుమార్ 7675924944