సెకండ్ షో...!
Published Sunday, 26 June 2016ఆకాశమంతా చుక్కలు పరుచుకున్నపుడు
గదుల నిండా చీకట్లు ముసురుకున్నపుడు
నా వారు అందరూ స్వప్న లోకాల్లో విహరిస్తున్నపుడు
నన్ను కదిపిన భావాల పరంపరలు నిద్రలేస్తాయి
నన్ను అక్షరాలుగా స్పందింపజేస్తాయి
ఇక నా ప్రయాణం మొదలవుతుంది
అనుభూతులు సంగీతాన్ని ఆలాపిస్తూంటే...
పదాల పదనిసలు నాట్యమాడుతాయి
ఒకే అనుభవంగా.. ఒకే లక్ష్యంగా...
మెదడు నిండిన భావావేశం
కాగితాలపై వెనె్నలలా జాలువారుతుంది
ఒక స్వానుభవ చిత్రం ఆవిష్కృతవౌతుంది
మళ్లీమళ్లీ ఆలోచనల ఆటుపోట్లకు
అమృతమై కవితాపుత్రిక రూపుదిద్దుకుంటుంది
నన్ను ఆనందపరవశున్ని చేస్తుంది..!
నన్ను అమరుడిగా లోకానికి పరిచయం చేస్తుంది...!