S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతని దేహంలో విదేశీ మోజులున్నాయి

వారి దేహంలో
విదేశీ మోజులున్నాయి
ఆర్కిటెక్టులు, ఆహ్వానాలతో
ఆకర్షిస్తున్నాడు.
హైటెక్‌లతో హంగులు దిద్దుతున్నాడు
స్మార్ట్‌గా స్మైల్ ఇస్తూ సైలెన్స్ చేస్తున్నాడు
కామ్‌గా కారిడార్లు అంటూ కాటేస్తున్నాడు
సింపుల్‌గా సింగపూర్ అంటూ
ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు
ఫైల్స్‌తో పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నాడు
ఒప్పందాలు అంటూ వాటేసుకుంటున్నాడు
పెట్టుబడులు అంటూ
పరుగులు పెట్టిస్తున్నాడు
రాజధాని పేరుతో రమ్మంటున్నాడు
విదేశీయుల్ని బొక్కేయ్యమంటున్నాడు
మాస్టర్ ప్లాన్స్‌తో కాటేస్తున్నాడు
పచ్చని పొలాల్ని పీకేస్తున్నాడు
పల్లెల్ని వల్లకాడు చేస్తున్నాడు
షేక్‌హ్యాండ్స్ ఇస్తూ షేర్లు అడుగుతున్నాడు
అతని దేహంలో విదేశీ మోజులున్నాయి.

-తంగిరాల-సోని 96766 09234