S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (జూలై 3 నుండి 9 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మనోబలంతో కార్యసిద్ధి. పనులు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంప్రదింపుల ద్వారా అనుకోని పనులు తేలికగా నెరవేరుతాయి. ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులకు సాయమందిస్తారు. శ్రీమతి సలహాల ద్వారా అయిన పరిచయాలు అభ్యున్నతికి తోడ్పడతాయి. విద్య, వైద్య, కళారంగాల వారికి అనుకూలం. ఒక వార్త ఆలోచింపజేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులుంటాయి. ప్రతిభకు గుర్తింపు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆశయసాధనకై సమర్థవంతంగా పని చేస్తారు. ఆదాయ వ్యయ లావాదేవీలు సంతృప్తికరం. ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం సంపాదిస్తారు. మోసాలకు అడ్డుకట్ట వేయండి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. వైద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అనుకోని సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు. విందులలో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కార్యాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుసుకొంటారు. పేరు ప్రతిష్ఠలు మెరుగవుతాయి. మనసుపెట్టి పనులు చేయండి. సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగనున్నాయి. అన్నింటినీ అనుమానంతో చూడకండి. విజయమార్గంలో ముందుకు సాగే అవకాశముంది. విలువైన వస్తువులు ఖరీదు చేసే విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ద్వంద్వ వ్యాపారాలు చేసేవారు అప్రమత్తతతో మెలగాలి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
కార్యసిద్ధి. నిరుత్సాహాన్ని దరి చేరనీయకండి. భవిష్యత్ ప్రణాళికలు ఆశాజనకంగా ఉంటాయి. అభిప్రాయ భేదాలు రానీయకండి. దంపతుల సాయంవల్ల శుభకార్యాలు జరుగనున్నాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగులకు బదిలీలు. వ్యాపార, వృత్తి రంగాల వారు శ్రమించి అనుకున్నది ఆలస్యంగానైనా సాధిస్తారు. ఇబ్బందికర సంఘటనలున్నా చాకచక్యంతో పరిష్కరించుకొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ప్రయత్నానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలే మిమ్మల్ని పనుల పూర్తికి ఉపకరిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆచితూచి వ్యవహరించండి. విద్య, వ్యాపార, సాహితీ, న్యాయ, రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. స్వీయ పర్యవేక్షణ అన్నింటా అవసరం. వాదులాటలు వద్దు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ఆత్మవిశ్వాసంతో చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మన్ననలు పెరుగుతాయి. స్ర్తిలు అభిమాన ధనంతో గౌరవించబడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులు మీతో సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతారు. వ్యాపార, వృత్తి రంగాల వారు లాభాలు అందిపుచ్చుకుంటారు. మిత్రుల సలహాలు ఉపకరిస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
తెలివితేటలే పెట్టుబడిగా కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశించినట్లుంటుంది. ఆహార, విహార, వ్యవహారాదుల్లో జాగ్రత్తలు పాటించండి. ఎందులోనూ అతి మంచిది కానే కాదని గుర్తిస్తారు. వ్యాపార, వృత్తి, రియల్ ఎస్టేట్, ఉద్యోగ రంగాల వారు శుభాలను అందుకుంటారు. స్థల మార్పిడి ఉంది. భవిష్యత్ విపత్తు నివారణలకు ఉపకరిస్తుంది. దంపతులు మనోధైర్యంతో మెలగుతారు. విద్యార్థులు సరైన విద్యకై సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వాదులాటవద్దు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. శక్తి మేరకు సమర్థవంతంగా పని చేస్తారు. మిత్రుల సహాయం సమయానికి అందుతుంది. ఉద్యోగులు అధికారులతో తెలివిగా మెలగాలి. పదోన్నతులు, బదిలీలకు అవకాశముంది. లక్ష్యాలను నెరవేరుస్తారు. స్ర్తిలు క్షమాగుణంలో ఎదుగుతారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. వృత్తి, వ్యాపారాలు, కళారంగాల వారు మెరుగైన విధానాలను ఆవిష్కరిస్తారు. భవిష్యత్తు గడిచిన దానికంటే ఫలవంతంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
అప్రమత్తంగా వ్యవహరించండి. పనులు మీ ఇష్టానుసారంగా సాగాలనుకున్నా విఘ్నాలు మధ్యమధ్య ఉండనున్నాయి. చివరకు సజావుగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో సంప్రతింపులు జరుపుతారు. ఆరోగ్యం మెరుగుకై ఔషధ సేవన తప్పదేమో ఆలోచించాలి. దంపతులు ఒకే పనిపై దృష్టి పెట్టండి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. వ్యాపార, వృత్తి, ఉద్యోగాల్లో ప్రగతి ఉంది. ఒడిదుడుకులను రానీయకండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ప్రయత్నం మేరకు సావకాశాలు కలసివస్తాయి. ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు. స్వీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం కలుగజేసుకోకండి. మీ పరిధిలోనే ఉండటం మంచిది. కొన్ని పనులు పూర్తవుతాయి. విద్య, వైద్య, న్యాయ, సాంకేతిక, ఏజెన్సీ రంగాల వారు కొత్త సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్నా, అంతిమ విజయాలున్నాయి. ప్రస్తుత పద్ధతిలోనే సంతోషాలను పొందుతారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ప్రశాంత జీవనానికై నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన లేకున్నా, ఖర్చుల నియంత్రణతో సర్దుబాట్లుంటాయి. వాహన సౌఖ్యం. ప్రయాణాలందు మెళకువలు అవసరం. వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. చెల్లింపులు వాయిదా వేసుకోకండి. భేషజాలకు, అవేశాలకు లోను కావొద్దు. కొత్త వ్యాపార మార్గాలు, ఏజెన్సీలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలున్నాయి. స్ర్తిలు తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒక వార్త జీవిత గమనాన్ని మారుస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యానుకూలతలుంటాయి. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్నింటా అప్రమత్తత అవసరం. ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండండి. మీ నిర్ణయాలకు ఎవరు వ్యతిరేకం చెప్పినా వినకండి. వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే పనిలో ఉంటారు. వృత్తి, వ్యాపార, వైద్య, సాంకేతిక రంగాల వారికి తృప్తి. విద్యార్థులకు కృషితో ఫలితం.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855