పెదాలే కాన్వాస్!
Published Saturday, 9 July 2016కళాకారుల్లో సృజనాత్మకతకు లోటుండదు. అందుకు ఇక్కడి చిత్రాలే నిదర్శనం. ఈ కళాకారిణి పేరు లౌరా జెన్కిన్సన్. ప్రఖ్యాత కామిక్, కార్టూన్ చిత్రాల్లోని బొమ్మలను ఇలా పెదాలపై చిత్రించడం ఆమెకు ఇష్టం. ‘100 డేస్ ఆఫ్ మేకింగ్ ఛాలెంజ్’ శీర్షికన ఆమె వంద రోజులూ వరుసగా ఇలా పెదాలపై విభిన్నమైన బొమ్మలను చిత్రించి అభిమానుల మెప్పు పొందారు. ఇన్స్టాగ్రామ్లో ఏరోజుకారోజు ఆమె చిత్రించిన పెదాలపై బొమ్మలను పోస్ట్ చేశారు.