S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటి శరీరం లోపలా మచ్చలుంటాయి!

తెల్లటి శరీరంపై నల్లని లేదా గోధుమరంగు మచ్చలతో కన్పించే డాల్మేషియన్స్ ప్రత్యేకతలు అన్నీఇన్నీకావు. పుట్టినప్పుడు తెల్లగా, ముద్దుగా కన్పించే ఈ శునకాలు నాలుగు వారాలు వచ్చేసరికి మచ్చలు మొదలవుతాయి. వాటికి శరీరం లోపలి భాగాల్లోనూ ఈ మచ్చలు ఉంటాయి. నోటి అంగుటిలో చూస్తే అవి కన్పిస్తాయికూడా. ఇవి స్వతంత్రంగా వ్యవహరించే శునకాలు. తర్ఫీదు ఇస్తే మాటవింటాయి. రక్షణ, క్రీడలు, వేట, కాపలా, అగ్నిప్రమాదాల నివారణ వంటి అంశాల్లో వీటికి శిక్షణ ఇచ్చి సేవల్లో వినియోగిస్తారు. అందుకే వీటి కోచ్‌డాగ్స్ అని యాంటీఫైర్ డాగ్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌లలో వీటికి ఆదరణ ఎక్కువ. నేటి క్రొయేషియాలోని అప్పటి ‘డాల్మేషి’ ప్రాంతంనుంచి ఇవి వచ్చాయని భావిస్తారు. ఈ జాతి పుట్టుకపై సాధికారిక వివరాలు పెద్దగా తెలీవు.

ఎస్.కె.కె.రవళి