S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాడ (అక్షరాలోచనాలు)

గూడు జారిపోయింది
చెట్టులేని పక్షి
ఏ దిక్కునో ఎగిరిపోయింది
ప్రవాహంలో పడి చందమామ
ఏ దరుల్లోనో కొట్టుకపోయింది
నిర్మలాకాశపు నక్షత్ర చేపలు
కకావికలం
మొరటు అడుగుల శబ్దాలకు
నిఘంటులైన కొండదారులు
మాయమై పోయాయి
విప్పపూలు, అడవితేనె
వెలగపండు, వెదురుపూత
ఎనె్నలపిట్ట, నెమలికన్ను
గొర్రెపోతు, గొర్రమోతు
దుప్పికొమ్ము, కొమ్ముబూర
రేలపాట, థింసాకు
‘ట్రాన్స్‌ట్రాయ్’ల పులివాత
నిర్జీవపు కుడ్య నిర్మాణం కింద
మునిగిపోతున్న
నిర్వాసిత జీవితపు జాడ

-నేలపూరి రత్నాజీ 9440328432