S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆదాయం పన్ను చెల్లించని వారిపై ఐడిఎస్ పథకంతో వెసలుబాటు

సిద్దిపేట, జూలై 21 : 2015-16 అర్థిక సంవత్సరానికి ఆదాయంపై పన్ను చెల్లించని వినియోగదారులు ఐడిఎస్ పథకం ఆదాయం పన్ను చెల్లించే వెసలు బాటు ప్రభుత్వం కల్పిస్తుందని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ రజత్ మిశ్రా అన్నారు. స్థానిక సాయిబాలాజీ హోటల్‌లో గురువారం ఆదాయపన్ను చెల్లింపుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015- 16 సంవత్సరానికి ఆదాయం చూపనివారు ఐడిఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూన్ 1, 2016 నుండి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడుతాయన్నారు. ఐడిఎస్ ద్వారా చెల్లించే పన్నులకు సర్‌చార్జ్, పెనాల్టీలు 30 సెప్టెంబర్ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. ఈ పథకం కింద ఏదైన ఆస్తి వివరాలు, ఆదాయ వివరాలు, తెలుపని వారు కూడ 1-6- 2016 వరకు ఉన్న ఆదాయ వనరులపై పన్ను వివరాలు వెల్లడించాలన్నారు. ఈపథకంపై వెల్లడించే ఆదాయంపై 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాలని, దీనికి అదనంగా చెల్లించిన పన్నులపై 25 శాతం సర్‌చార్జీ, 20 శాతం పెనాల్టీ రూపంలో మొత్తం 45 శాతం పెనాల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా పన్ను చెల్లించే వారిపై వెల్త్‌టాక్స్ ద్వారా సదరు వెల్లడి చేసిన ఆస్తికి మినహాయింపు, పన్ను చెల్లించేవారికి ఆస్తిపై స్కూృటీనిపై ఎంక్వైరీ మినాహాయింపు ఉంటుందన్నారు. అంతకు ముందు 142(1),143(2), 148/ 153 ఎ,/153 సి నోటీసులు ఇవ్వబడిన అసెస్‌మెంట్ సంవత్సరాలకు ఈ పథకం వర్తించదన్నారు. అలాగే సర్వే,సోదాలు, నోటీసులు పొందబోయే వారికి అయా సంవత్సరాల క్రింద ఈ స్కీమ్ వర్తించదన్నారు. వివరాలు సక్రమంగా వెల్లడించని వారిపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ ఐటి అధికారి రామకృష్ణ, సిద్దిపేట ఐటి అధికారి గుణవంతరావు తదితరులు పాల్గొన్నారు.