S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రచారాలకు వేలకోట్లు ధారాదత్తం

మెదక్ రూరల్, జూలై 21 ప్రచారాలకు వేలకోట్లు ధారాదత్తం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు 30 నుండి 89వేల కోట్లకు పెంచి కమీషన్‌లు జేబులు నింపుకుంటున్నారని, తెరాస ప్రభుత్వం పూర్తిగా విభజించి పాలిస్తుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మంబోజిపల్లి ఎన్‌డిఎస్‌ఎల్ కార్మికుల 66వ రోజు దీక్షలకు కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోకలిసి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది బాధలు పోగోట్టడానికి లేక బాధలు పెట్టడానికా అంటు ప్రశ్నించారు. ఎన్‌డిఎస్‌ఎల్ కార్మికుల సమస్య జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాగానడిచిన కర్మాగారాన్ని టిడిపి హయాంలో ప్రైవేటీకరిస్తే తెరాస ప్రభుత్వం కర్మాగారంను మూసివేయించి కార్మికులు, కర్షకులను రోడ్డున పడేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సభాసంఘం, అధికారుల కమిటీ, 2014లో మంత్రులతో కమిటీ ఏర్పాటుచేసి ఎవరికి తలొగ్గకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సూచించిందని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకివచ్చిన తెరాస నాడు మాపై నిందలువేసి నేడు ఎవరికి తలొగ్గారు, ఎవరికి దారాదత్తం చేశారని ప్రశ్నించారు. కార్మికులు వేతనాలులేక ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. 4 లక్షల టన్నులు గానుగాడాల్సిన కర్మాగారం లక్ష టన్నులకు పడిపోయిందన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి మూడు కర్మాగారాల్లో ఉన్న 300 కార్మికుల వేతనాలు చెల్లించడం చేతకాదా అన్నారు. ఏం సాధించారని తెలంగాణ ఆవిర్భావం జూన్ 2న 210 కోట్ల విలువచేసే ప్రకటనలు ఇచ్చుకున్నారని సునీతారెడ్డి ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ, భగీరథ ఎవరికోసం, ప్రాణహిత-చేవేళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాలు 30 నుండి 89 వేల కోట్లకు పెంచి తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. అక్రమ లే ఆఫ్ ఎత్తివేసి, కార్మికులకు వెంటనే వేతనాలు ఇప్పించాలని త్వరలో ముఖ్యకార్యదర్శిని కలుస్తామన్నారు. కార్మికులు, కర్షకులకు మద్దతుగా ఎంతటి ఆందోళనకైనా సిద్ధమేనన్నారు. మన బతుకుల బాగుకోసం పోరాటం తప్పదన్నారు.
మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి అధికార ప్రతినిధి పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఉద్యమ సమయంలో ప్రభుత్వం మెడలువంచుతామని నేడు అధికారంలోకి వచ్చినా ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరి మెడలు వంచాలని ప్రశ్నించారు. అత్యంత విలువైన కర్మాగారాలను చంద్రబాబు తక్కువ ధరకు విక్రయించగా, కెసిఆర్ పూర్తిగా కర్మాగారాలను అమ్ముకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎన్‌డిఎస్‌ఎల్ కార్మికుల ఆందోళనకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కార్మిక నాయకులు పల్లె సిద్దిరాములుగౌడ్ మాట్లాడుతూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. మాజీ జడ్‌పిటిసి మామిళ్ల ఆంజనేయులు అధ్యక్షత వహించగా కొల్చారం జడ్‌పిటిసి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్‌లు దుర్గారెడ్డి, నరేందర్‌రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, కేశవరెడ్డి, నర్సింలుగౌడ్, సాయిలు, మల్లేశం, కొండ శ్రీనివిస్, శ్రీనివాసరావు, చిట్యాల యాదయ్య, కార్మిక నాయకులు బాపురెడ్డి, వెంకటేశం, ధర్మేందర్ పాల్గొన్నారు.