S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంజీరాలో ఇద్దరు యువకుల గల్లంతు

మద్నూర్, జూలై 21: కుర్ల-బీర్కూర్ గ్రామాల మధ్య మంజీరాపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతు కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. మద్నూర్ పోలీసులు, డోంగ్లీ గ్రామస్థుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామానికి చెందిన వాగ్మారే యాదవరావు(17), లోకండె బాబు(17), శివ అనే యువకులు వారి సోదరులు బోధన్‌లో చదువుకుంటుండగా, గురువారం వారిని పాఠశాలలో వదిలిపెట్టి వచ్చేందుకు వెళ్లినట్లు డోంగ్లీ గ్రామస్థులు తెలిపారు.
అయితే బోధన్‌లో వారి సోదరులను వదిలిపెట్టిన తర్వాత తిరుగు ప్రయాణంలో బీర్కూర్ మీదుగా డోంగ్లీ వచ్చే క్రమంలో కుర్ల-బీర్కూర్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ముగ్గురు యువకులు స్నానానికి దిగడం జరిగిందన్నారు. అయితే వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో యాదవరావు, లొకండే బాబులు నీటిలో గల్లంతు కాగా, శివ అనే యువకుడు ప్రాణాలతో బయపడినట్లు మద్నూర్ పోలీసులు తెలిపారు. ఇద్దరి స్నేహితులు నీటిలో గల్లంతు కావడంతో బయపడిపోయిన శివ, గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుపడంతో గ్రామస్థులు, యువకుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.
మంజీరాపై బీర్కూర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మద్నూర్ పోలీసులు తెలిపారు.