S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారంలో నిజామాబాద్ టాప్

ఇందూర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 10జిల్లాల్లో నిజామాబాద్ 22శాతం లక్ష్యాన్ని సాధించిన మొదటి జిల్లాగా నిలిచిందని, ఇందుకు కృషి చేసిన అధికారులందరికి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అభినందనలు తెలిపారు. గురువారం జిల్లాలోని 36మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, చేంజ్ ఏజెంట్లు, ఎపిఓలతో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హరితహారం కార్యక్రమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాటు చేసిన అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే 55శాతం పూర్తి చేయడం జరిగిందని, ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిజామాబాద్ జిల్లాలో చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. మండలాల వారిగా 40వేల లక్ష్యాన్ని పూర్తి చేసిన గ్రామ పంచాయతీలు ఎన్ని, 40వేలకు తక్కువ మొక్కలు నాటిన గ్రామ పంచాయతీల వివరాలు తెలుసుకుంటూ, బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై, ఎపిఓలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో నర్సరీల్లో గల వివిధ రకాల మొక్కలను నాటించాలని, ప్రజలకు ఇండ్లలో కావాల్సిన మొక్కలను అందించాలని గతంలో అనేక పర్యాయాలు సూచించినా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కాలయాపన చేయడంపై కలెక్టర్ మండిపడ్డారు. జిల్లాలో 40వేల లక్ష్యాన్ని పూర్తి చేసిన గ్రామ పంచాయతీలు పోనూ, మిగతా జిపిలకు 4వేల చొప్పున టేకు స్టంపులను అందించి లక్ష్యాన్ని పూర్తి చేయించాలన్నారు. 30వేలు దాటిన గ్రామ పంచాయతీలకు 2,500చొప్పున పండ్ల మొక్కలను అందజేయాలన్నారు. జిల్లాలో ఆర్మూర్, పిట్లం, బీర్కూర్, నిజామాబాద్ మండలాలు హరితహారం లక్ష్యాన్ని చేరుతున్నందున ఆ మండలాల అధికారులను కలెక్టర్ అభినందించారు. అలాగే ఆర్మూర్ మండలం అన్ని గ్రామాల్లో 40వేల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేయించి జిల్లాలోనే మొదటి మండలంగా నమోదైయ్యిందని, ఆ మండల టీమ్ బృందాన్ని కలెక్టర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఏయే మండలాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తు పనులు చేస్తున్నారో వారు రాత్రి బస చేయకుండా, ఉదయం 6గంటలకే వెళ్లి పనులు చేయించాలన్నారు. అదే సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారు ఖచ్చితంగా రాత్రి బస చేయడంతో పాటు రాబోయే రెండు రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేయాలని ఆదేశించరు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి రవీందర్‌రెడ్డి, ఎజెసి రాజారాం, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.