S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యమంలా హరితహారం చేపట్టాలి

గంగాధర, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. గురువారం మండలంలోని బొమ్మలమ్మగుట్ట వద్ద ఎస్‌ఐ నీలం రవి ఆధ్వర్యంలో హరితహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పీ జోయల్ డేవిస్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం హరితహారంలో చారిత్రక ప్రదేశమైన బొమ్మలమ్మ గుట్ట వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. తమ సొంత రాష్టమ్రైన తమిళనాడుకు వెళ్తే హరితహారంపై అక్కడి ప్రజలు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో 86 గ్రామాలు దత్తత తీసుకోగా ఆయా గ్రామాల్లో ప్రస్తుతం 15 వేల మొక్కలు నాటామన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా దత్తత తీసుకున్న 9 చెరువు గట్ల వద్ద ఈత మొక్కలు నాటుతున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే బొడిగ శోభ మాట్లాడుతూ పోలీసులు లాఠీ పట్టుకొని శాంతిభద్రతలు కాపాడడమే కాక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు హరితహారంలోనూ పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, ఎంపిపి దూలం బాలాగౌడ్, చొప్పదండి సిఐ లక్ష్మీబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేండ్ల పద్మ, ఎస్‌ఐ నీలం రవి, సర్పంచ్‌లు భూమాగౌడ్, వైద రామానుజం, ఎంపిటిసి నందయ్య, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రేండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం గంగాధర చౌరస్తాలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను గురువారం ఎస్పీ జోయల్ డేవిస్, ఎమ్మెల్యే బొడిగ శోభ ప్రారంభించారు. వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన గంగాధర చౌరస్తాలో దోపిడీల నివారణకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, సిఐ లక్ష్మిబాబు, ఎస్‌ఐ నీలం రవి, ఎంపిపి బాలాగౌడ్, సర్పంచ్ వైద రామానుజం, ఎంపిటిసి పెర్క మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.