S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారం లక్ష్యాలను అధిగమించాలి

కరీంనగర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాలలో లక్ష్యాలకనుగుణంగా అధిగమించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించాలని అలాగే ఏయే ప్రాంతాలలో ఎలాంటి మొక్కలు నాటుతున్నారు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా నర్సరీల ద్వారా మొక్కల సరఫరా జరుగుతుందా లేదా ఇంకా కావలసిన మొక్కల డిమాండ్లపై సమీక్షించారు. ఆయా మండలాలలో లభ్యం కాకుండా ఉన్న మొక్కలను సమీప మండలాలలోని నర్సరీల నుండి తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. మొక్కలను నాటే ప్రాంతంలో నీటి లభ్యతను ముందుగా పరిశీలించుకోవాలని, మొక్కలను ఖచ్చితంగా నాటాలని, నాటిన మొక్కలను నీటిని తప్పకుండా పోసి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో లక్ష్యాలను అధిగమించాలని ఈత మొక్కలను లభ్యం మేరకు ఆయా మండలాలు, గ్రామాలలో నాటించాలని ఎక్సైజ్ సహాయ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి శ్రీదేవసేన, ఎజెసి నాగేంద్ర, మున్సిపల్ కమిషనర్ కృష్ణ్భాస్కర్, డిఎఫ్‌ఓలు వినోద్‌కుమార్, రవికుమార్, డ్వామా పిడి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.