S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరణంలోనూ వీడని పేగు బంధం

వేములవాడ, జూలై 21: వారిద్దరూ అన్నదమ్ములు.. కష్టాలతో జీవనం సాగిస్తున్నారు. రెక్కడితే కానీ డొక్కాడని దీనస్థితి.. దినసరి కూలీ వేతనం పై వచ్చే డబ్బులతోనే ఆ కుటుంబాలు పూటవెళ్లదీస్తాస్తున్నాయి.. అయితే విధి ఈ నిరుపేదల కుటుంబాలపై కనె్నర్రజేసింది.. కూలీ పనికి బయలుదేరిన అన్న మార్గమధ్యలో ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. అన్నను కడసారి చూడటానికి వెళ్లిన ఆ తమ్ముడు, రక్తపుమడుగులో పడి ఉన్న అన్న శవాన్ని చూసి ఆ తమ్ముడి హృదయం బద్దలైంది. అన్న మృతి చెందిన కొద్ది గంటలకే ఆ తమ్ముడు మరణించడం పట్టణంలో వివాద వాతవరణం నెలకొన్నది. పట్టణంలో అంబేద్కర్ వీధిలో సాహెబ్ హుస్సెన్ (50)ది నిరుపేద కుటుంబం. రోజూవారి మేస్ర్తి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగే దినసరి పనిమీద ఇంటి నుంచి బుధవారం సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి బయలు దేరాడు. సిరిసిల్ల దాటి పెద్దూరుకు చేరుకొని కూలీ పని ముగించుకొని తిరిగి వేములవాడకు బయలుదేరాడు. ఇంతలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి చెందిన భక్తులు కారులో దర్శనానికని వస్తున్నారు. అయితే కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడపుతూ ముందు వెళ్తున్న సాహెబ్ హుస్సెన్‌ను ఢీకొట్టాడు. దీంతో సాహెడ్ అక్కడి కక్కడే మృతి చెందాడు. అన్న మరణ వార్త తెలుసుకున్న తమ్ముడు షేక్ గుడ్ (48) హుటహుటినా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో విగతజీవై ఉన్న అన్న మృతదేహాన్ని చూడటంతో ఒకస్కారిగా అతనికి బిపి లెవల్స్ పెరిగిపోయి కిందపడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ తీసుకెళ్లాలని అతని బంధువులకు సూచించారు. దీంతో కరీంనగర్ తరలించి వైద్య చికిత్సలు చేయిస్తున్న సమయంలో షేక్‌గుడ్ తుడి శ్వాస విడిచారు. ఒకే రోజూ అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కాలనీలో విషాదం నెలకొన్నది.
ఇంటికి తాళం
అయితే అన్నదమ్ములు మరణించడంతో వారి కిరాయి ఉంటున్న యజమానులు వెంటనే ఇంటికి తాళాలు వేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పదిరోజుల వరకు ఇంటికి రావద్దని చెప్పడంతో మృతదేహాలను స్థానిక ముస్లింలు మసీదులో ఉంచి ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఖననం చేశారు.