S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘పురం’ ప్రభుత్వాసుపత్రిపై దాడి కేసు కొట్టివేత

హిందూపురం, జూలై 21 : 2004లో స్థానిక ప్రభుత్వాసుపత్రిపై దాడి చేసిన కేసును కొట్టివేస్తూ జూనియర్ సివిల్ జడ్జి షేక్ జానీబాషా గురువారం తీర్పు చెప్పారు. దీంతో దశాబ్దం తర్వాత కేసులో ఉన్న ముద్దాయిలకు విముక్తి కలిగినట్లైంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2004లో పట్టణంలోని రహమత్‌పురానికి చెందిన ఆస్మాభాను ప్రసవం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రాగా వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లీబిడ్డ మృతి చెందారు. దీంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని ఆగ్రహావేశాలతో బంధువులు కొందరు ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై అప్పట్లో స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో 24 మందిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి న్యాయమూర్తి 16 మంది సాక్షులను విచారించారు. అయితే పోలీసులు సరైన సాక్ష్యాధారాలను నిరూపించకపోవడంతో న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు కాగా విచారణ సమయంలోనే ఇద్దరు మృతి చెందారు. మిగిలిన 22 మందికి 12 ఏళ్ల తర్వాత కేసు నుంచి విముక్తి లభించినట్లైంది. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రారెడ్డి వాదించగా ప్రాసిక్యూషన్ తరపున ఇన్‌చార్జి ఎపిపి నాయక్ వాదించారు.