S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

చెనే్నకొత్తపల్లి, జూలై 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చెనే్నకొత్తపల్లి సమీపాన హంద్రీనీవా కాలువ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మస్తాన్‌వలి(32) గ్రామంలో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం తెల్లవారుజామున స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంలో గుట్టూరుకు కోళ్ళను తీసుకురావడానికి బయలుదేరాడు. అయితే చెనే్నకొత్తపల్లి దాటగానే హంద్రీనీవా కాలువ వద్ద వెనుకవైపు నుండి గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్‌వలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చెనే్నకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.