S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘హోదా’ బిల్లుకు మద్దతు తెలపాలి

అనంతపురంటౌన్, జూలై 21: ఎ.పికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి ప్రారంభమై జెడ్.పి కార్యాలయం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కోటాసత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధి, వాసు, కొండారెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం ఎపికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ప్రకటించాల్సి ఉందన్నారు. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేండ్లు కాదు పదేండ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై వౌనం పాటిస్తోందన్నారు. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఈ హామీలేవి అమలుచేయకపోగా ప్రత్యేక హోదాపై దాటవేత ధోరణి అవలంబిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎపి ప్రజలను మోసపుచ్చుతోందన్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. కావున అన్ని పార్టీలు ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.