S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుంతకల్లులో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి

గుంతకల్లు, జూలై 21 : గుంతకల్లులో పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు హరిహరనాథ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీ బుగ్గ సంఘాల వద్ద పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా గుంతకల్లు స్పినింగ్ మిల్లును తెరిపించి ఉపాధి కల్పించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పిఎం ఆవాస్ యోజన పథకాన్ని అర్హులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైతులు అతి తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్ధి కోసం రాష్ట్ర బిజెపి నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక ధర్మవరం, విజయవాడ మధ్య ఏర్పాటు చేసిన కొత్త రైలును వయా గుంతకల్లు మీదుగా మళ్లించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభూకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో బైపాస్ లైన్ నిర్మాణానికి నిధులు మంజూరైనా అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. త్వరితగతిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను బిజెపి కార్యకర్తలు పేదలకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, నియోజక వర్గ కన్వీనర్ శేఖన్న, పట్టణ కార్యదర్శి పట్నం రామాంజినేయులు, దళిత మోర్చా నాయకులు రామాంజినేయులు, నాయకులు కొలిమి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.