S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేరాల అదుపులో తనదైన ముద్ర

అనంతపురం, జూలై 21 : జిల్లాలో నేరాలు అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌వి.ఎస్పీ రాజశేఖర్‌బాబు తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల పాలనలో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంతో పాటు, అన్ని వర్గాలను సమన్వయ పర్చుకుని పోలీసు శాఖను ప్రగతి పథంలో నడిపించి విజయం సాధించారనడంలో సందేహం లేదు. అంతేగాకుండా ప్రజల భాగస్వామ్యంతో పోలీసుల స్వచ్ఛ భారత్, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్షల్లో మొక్కల పెంపకం తదితర సామాజిక, సేవా కార్యక్రమాలను సైతం చేపట్టి తనదైన ముద్ర వేశారు. ప్రత్యేకంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాబాట, నేరస్తుల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు వినూత్న రీతిలో ‘ఒక దొంగ- ఒక పోలీసు’ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ, ఐసిడిఎస్, ఎన్టీఓల సహకారంతో మహిళలు అక్రమ రవాణాకు అధికంగా గురయ్యే కదిరి సబ్ డివిజన్‌లో ఇంటింటా సర్వే చేసి ట్రాఫికర్లు, ట్రాఫికింగ్‌కు గురైన మహిళల్ని గుర్తించారు. ఇక ఫ్యాక్షన్ అదుపునకు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల కదలికలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంతో పాటు పల్లె నిద్ర, కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ తదితర కార్యక్రమాలతో పాటు గ్రామాధిపత్యం, రాజకీయ, వ్యక్తిగత కక్షల నిర్మూలనకు ఎస్పీ కృషి చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అటు ప్రజలు, ఇటు పోలీసులకు వారధిగా ఎస్పీ పని చేస్తున్నారు. సిబ్బందిని అంకిత భావంతో పని చేయిస్తున్నారు. ఇకపోతే జిల్లాలో భూకబ్జాలు, భూదందాలపై యాంటి ల్యాండ్ గ్రాబింగ్ పేర జిల్లాకేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి నేతృత్వంలో ముగ్గురు డిఎస్పీలు ఈ విభాగానికి ఇన్‌చార్జులుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు 400 మంది బాధితులకు న్యాయం చేయడంతోపాటు రూ.50 కోట్ల విలువైన ఆస్తుల్ని బాధితులకు తిరిగి ఇప్పించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా 16 ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గడచిన రెండేళ్లలో రూ.13 కోట్ల మేర విలువజేసే ఆభరణాలు, నగదు చోరీ అయితే ఇందులో రూ.9 కోట్ల మేర రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అలాగే నకిలీ పాసు పుస్తకాల గుట్టురట్టు చేశారు. 24 వేల నకిలీ పాసుపుస్తకాల్ని ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ముమ్మరం చేశారు. క్రికెట్ బెట్టింగ్ కంపెనీల గుట్టు రట్టు చేశారు. మట్కా, పేకాట వంటి జూదాల ఆటకట్టించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఏదిఏమైనా శాంతిభద్రతలతోపాటు నేరాల అదుపునకు ఎస్పీ చర్యలు ఎనలేనివని చెప్పవచ్చు.