S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేరు మార్చినా ఫలితం శూన్యం!

అనంతపురం, జూలై 21 : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీవ్ యువశక్తి పేరుతో ఉన్న పథకాన్ని అంతకు ముందు ఉన్నట్టుగానే సిఎంఇవై (చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ యోజన)గా మార్చింది. పేరైతే మార్చిందిగానీ స్వయం ఉపాధి పథకాలూగానీ.. నిధుల కేటాయింపుగానీ లేకుండా పోయింది. నిరుద్యోగ యువతకు ఆన్‌సెట్, జిల్లా యువజన సంక్షేమ శాఖ ద్వారా ఉపాధి కల్పనకు పథకాలేవీ అమలు చేయక పోవడంతో యువజన సంక్షేమం నీరుగారిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆన్‌సెట్ సంస్థకు, జిల్లా యువజన సంక్షేమ శాఖకు వేర్వేరుగా సిఇఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లు ఉండేవారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఆన్ సెట్ సిఇఓనే జిల్లా యువజన సంక్షేమ శాఖకు ఎఫ్‌ఎసి (్ఫల్ అడిషనల్ చార్జ్)గా నియమించింది. ఇందులో భాగంగా జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఉపాధి కార్యక్రమాలు, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్న అంశంపై రాష్టస్థ్రాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం మేనేజింగ్ డైరెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆన్‌సెట్ సిఇఓలు, మేనేజర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా నెలకొల్పేందుకు అవకాశం ఉన్న స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలు, పరిశ్రమలపై ఫీడ్‌బ్యాక్ (సమాచారం) తీసుకున్నారు. అయినా ఇంత వరకు ఆన్‌సెట్, జిల్లా యువజన సంక్షేమ శాఖ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం ఏయే పరిశ్రమలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్న జాబితాను తయారు చేయకపోడం విశేషం. కనీసం మార్గదర్శకాలు సైతం జారీ చేయకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది.
రెండేళ్లుగా కనబడని ‘ఉపాధి’ పథకాలు..
గత ప్రభుత్వాల హయాంలో ఆన్‌సెట్ ద్వారా ఆర్థిక పరమైన సాయంతో పరిశ్రమలు, సేవా రంగాలు, డెయిరీ, ఇతర వ్యాపార రంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం బిసి, ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం బ్యాంక్ లింకేజీతో ఉపాధి పథకాలు అమలు చేస్తోంది. అదే తరహాలో ఇన్‌సెట్, యువజన సంక్షేమ శాఖ ద్వారా కూడా నైపుణ్యం లేని, ఎంతో కొంత నైపుణ్యం ఉన్న నిరక్షరాస్యులతోపాటు విద్యావంతులకు కూడా వివిధ పథకాలను అమలు చేయాల్సి ఉంది. గతంలో టైలరింగ్, డెయిరీ, డ్రెస్ మేకింగ్, చిన్నచిన్న వ్యాపారాలు, చిరు పరిశ్రమలు, వివిధ రవాణా వాహనాలు వంటి వాటికి సబ్సిడీ రుణాలు ఆచ్చి ఆదుకున్నారు. ఇపుడా పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాను అనువైన పారిశ్రామిక, వ్యవసాయనుబంధం, వివిధ సేవారంగాల్లో ఉపాధి కల్పించాల్సి ఉందని ఆన్‌సెట్ జిల్లా అధికారులు ప్రభుత్వానికి సూచించారు. గత ఏడాది కాలం నుంచి యూత్ ఫెస్టివల్స్, యూత్ ఎక్చేంజ్, వివేకానందుడి కార్యక్రమాలు, బ్లడ్‌డొనేషన్ క్యాంపులు వంటి వాటితో పాటు ఇటీవల ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ప్రీట్రైనింగ్, ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికే ఆన్‌సెట్, యువజన సంక్షేమ శాఖల్ని పరిమితం చేశారు. అయితే ఎప్పుడు ఉపాధి పథకాలను ఈ శాఖల ద్వారా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులైన యువ నిరుద్యోగులు వేలల్లో స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.