S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలకలం రేపినజంటహత్యలు

అనంతపురం సిటీ, జూలై 21: జిల్లా కేంద్రంలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఆధిపత్య పోరుకై గురువారం అన్నదమ్ముల జంట హత్యలు జరిగాయి. గురువారం రుద్రంపేట బైపాస్ దాటుకుని చంద్రబాబునాయుడు కొట్టాల వైపుకు వెళ్తున్న గోపినాయక్ (30), వెంకటేసు(31)లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని మదిగుబ్బ గ్రామానికి చెందిన నారాయణనాయక్ కొడుకు గోపినాయక్, నారాయణనాయక్ అన్న కొడుకు వెంకటేసులు గురువారం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు రుద్రంపేట బైపాస్ నుండి చంద్రబాబునాయుడు కొట్టాలకు వెళ్లే సమీపంలో బైకుపై వెళ్తుండగా నిందితులు ఎదురుగా ఆటోలో వచ్చి హతుల బైకును ఢీకొట్టారు. దీంతో హత్య గావింపబడిన ఇద్దరు కింద పడిపోవడంతో కొంతమంది ఆటోలో నుండి, మరికొంతమంది బైకు, బులెరోల నుండి దిగి కత్తులతో పొడిచి, ఐరన్ రాడ్లతో కొట్టి చంపేశారు. హత్యా స్థలంలో హతుల బైకు విడిచి బులెరోలో పారిపోయారు. దీంతో రుద్రంపేట బైపాస్‌లోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యాయారు. ఒక్కసారిగా రెండు హత్యలు ఒకేసారి జరగడంతో రుద్రంపేట బైపాస్‌లోని ప్రజలు, చంద్రబాబునాయుడు కొట్టాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అలాగే ఎస్పీ కార్యాలయం నుండి రుద్రంపేట బైపాస్, చంద్రబాబునాయుడు కొట్టాల వరకు పోలీసు అధిక సంఖ్యలో మొహరించారు. హత్యగావింపబడిన వారు గతంలో ఆరు కేసులలో నిందితులని, వారు రౌడీషీటర్లుగా పలు స్టేషన్లలో పేర్లు నమోదయ్యాయి. చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన మృతుల సమీప బంధులైన అమర్, అక్కులప్పలకు గత నెల రోజుల క్రితం రుద్రంపేట బైపాస్ సమీపంలోని ఒక భూ తగదా వచ్చినట్లు సమాచారం. దీంతో కాపుకాచిన ప్రత్యర్థులు గోపి, వెంకటేసులను హత్య చేశారు. ఈ జంట హత్యల సమాచారం తెలుసుకున్న నాల్గవ టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను మార్చురీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన గోపి నాయక్, వెంకటేసు నాయక్‌లుగా మృతులను గుర్తించారు. గతంలో పలు కేసుల్లో నిందితులని, వీరు రౌడీషీటర్లని పోలీసులు తెలిపారు. మృతుల సమీప బంధువులైన అమర్, అక్కులప్ప అనే ఇద్దరు వ్యక్తులతో గత నెల రోజుల కింద ఒక భూ వివాదంలో కొంత వివాదం మొదలైందని, అందులో ఫైనాన్స్‌కు సంబందించి ఇద్దరు వాదులాడుకున్నారని, అందుకు వీరందరిని పోలీసుల స్టేషన్‌కు పిలపించుకుని కౌనె్సలింగ్ చేసి పంపారని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులను అరెస్టు చేశాలని ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన అమర్, అక్కులప్పలతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హత్య చేయించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ
రుద్రంపేట బైపాస్‌లో హత్యకు గురైన గోపినాయక్, వెంకటేసు నాయక్ మృతదేహాలను గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్‌లు సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి పరిటాల సునీత మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.