S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పార్టీ బలోపేతానికి కృషి

ప్రొద్దుటూరు, జూలై 21: రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాము అ న్నివిధాలా కృషి చేస్తున్నామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప పార్లమెంటరీ వ్యవహారాలా అబ్జర్వర్ జ యనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్‌బి అతిథిగృహంలో ఆ పార్టీ నాయకులతో జరిగిన సమన్వయకమిటీ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ లోకేష్‌నాయుడు ఆదేశాల మేరకు తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇక్కడ నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించామని, పార్టీపరంగా అంతా సవ్యంగానే వుందన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని, లేకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ప్రొద్దుటూరు ప్రజలకు తాగునీటిని అందించేందుకై ప్రారంభించిన కుందూ- పెన్నా వరదకాలువను కూడా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటి అమలుకు తమ వంతుగా పాటుపడాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనికీ అడ్డు తగులుతూ విమర్శిస్తున్నాడని, ఆయనకు అది ఎంతమా త్రం తగదని హితవుపలికారు. పట్టిసీమ ప్రాజెక్టును విమర్శించిన జగన్ ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఎంతోమంది రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతోందన్నారు. వైకాపా చేపట్టిన గడపగడపకై వైకాపాకు ప్రజల్లో స్పందన లేదని, 16 నెలలు జైల్లో వుండి వచ్చిన జగన్ చంద్రబాబును విమర్శించేందుకు అర్హత లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నర్సానాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి, రాష్ట్ర పౌరసఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మున్సిపల్ ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైస్ ఛైర్మెన్ జబీవుల్లా, ముక్తియార్ పాల్గొన్నారు.