S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

రాజంపేట, జూలై 21: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను తనకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాజీ కేంద్రమంత్రి ఎ.సాయిప్రతాప్ అన్నా రు. గురువారం స్థానిక మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సాయిప్రతాప్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సీనియర్ తెలుగుదేశం నాయకుడు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే విషయంలో తనకు మద్దతు పలికినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికప్పుడు పార్లమెంటు నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పార్టీని ప్రజలకు దగ్గర చేర్చేందుకు యత్నిస్తానన్నారు. రైల్వేపరంగా ఉన్న సమస్యలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. కడప రైల్వేకేంద్రం దగ్గరగా ఉందన్న సాకుతో రాజంపేట రైల్వేకేంద్రంలో పలు రైళ్లకు స్టాపింగ్ వసతి కల్పించడంలో అన్యా యం జరుగుతుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి తగుచర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలకు తీసిపోకుండా, మరింత ఉన్నతంగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు చేయూత అందించేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సి ఉందన్నారు. విపక్షనేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో ఎలాంటి పసలేదని కొట్టిపారేశారు. ఇంకుడు గుంటలవల్ల భూగర్భజలాలు పెరుగుతున్నాయని, చెరువుల్లో పూడిక తీయడంవల్ల చెరువుల్లో నీరు పూర్తిగా ఎండిపోయినా, కుంటల్లో అత్యవసరాలకు సరిపడ నీరు ఉంటున్నదన్నారు. సైంటిఫిక్ కోణంలో కూడా ఆలోచిస్తూ నేటి టెక్నాలజీని చక్కగా వినియోగించుకొంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరేనన్నారు. నదుల అనుసంధానంతో రైతుల కష్టాలు తీర్చేందుకు సిఎం పడుతున్న శ్రమ భావితరాలకు ఎంతో విలువైనది కానున్నదన్నారు. మేడాకు సాయిప్రతాప్ ప్రశంసలుఒక శాసనసభ్యునిగా మేడా మల్లికార్జునరెడ్డి పనితీరు అభివృద్ధిలో చాలా వేగంగా ఉందన్నారు. ముందుచూపుతో ఆయన భావితరాలకు కూడా ఉపయోగపడేరీతిలో బృహత్తర ప్రణాళికలు అమలుచేస్తూ ముం దుకెళ్తున్నారన్నారు. ఒంటిమిట్ట దేవస్థానానికి ప్రభుత్వ లాంఛనాలు మొదలు, ఒంటిమిట్ట చెరువుకు సాగునీరు అందించడం లాంటి ఎన్నో చారిత్రాత్మక అభివృద్ధిపనులు మేడా హయాంలో జరిగాయన్నారు. నేడు రాష్ట్రంలో సీనియర్ మంత్రులతో 10 మంది సమన్వయ కమిటీని వేస్తే అందులో మేడా ఒకరుగా ఉండడంచూస్తే ఆయన పనితీరుపట్ల ముఖ్యమంత్రికి సహేతుకమైన అభిప్రాయం ఉండడమే కారణమన్నారు.