S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పార్టీ బలోపేతానికి చర్యలు

కడప, జూలై 21:తెలుగుదేశంపార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్‌ను పటిష్టం చేసేందుకు సమన్వయ కమిటీలను సమన్వయ పరుస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలకు ఉన్న త్వరలో వాటిని విభేధించి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో ఆయన గురువారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించి పార్టీ అగ్రనేతలతో సమావేశమై అనంతరం సమన్వయ కమిటీల నేతలు, సభ్యులతో సమావేశమయ్యారు. అలాగే వివిధ ప్రాంతాల్లో మద్య నేతల మధ్య ఉన్న విభేధాలు తెలుసుకునేందుకు నేతలను టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తూ వ్యక్తిగతంగా పార్టీలో ఉన్న లోటుపాట్లను తెలుసుకుంటూ కేడర్ అంతా సమన్వయంతోపనిచేయాలని పార్టీ బలోపేతమైతేనే నాయకులకు భవిష్యత్ ఉంటుందని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యానికి పాల్పడితే భవిష్యత్‌లో పార్టీ నష్టపోవడంతోపాటు నాయకులకు కూడా రాజకీయ మనుగడ ఉండదని కండబద్ధలు కొట్టినట్లు చెప్పుకొస్తున్నారు. నేతలు కూడా పంతాలకు వెళ్లి కార్యకర్తలను విస్మరిస్తే 2019 ఎన్నికల నాటికి వారికి టికెట్లు కూడా గల్లంతు అవుతాయని నేతలకు ఖచ్చితంగా సూచిస్తున్నారు. జిల్లాలో ప్రతిపక్షపార్టీ వైకాపా బలంగా ఉందని గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రాజంపేట అసెంబ్లీని సాధించుకుందని ఆయన గుర్తు చేశారు. 2019 నాటికి అన్ని అసెంబ్లీ స్థానాలను , పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేందుకు నేతలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏ ఒక్కరినీ క్షమించే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. ఏవైనా చిన్నపొరపాట్లు ఉంటే అక్కడి నేతలు చక్కదిద్దాలని లేని పక్షంలో చర్యలు తప్పవని, పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికలోటు ఉన్నా ముఖ్యమంత్రి ,పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడివున్నారని , అలాగే జిల్లాపై పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నారని ఈ తరుణంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. తెలుగుదేశంపార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఈ తరుణంలో నాయకులు విభేధాలు మరచి పనిచేయాలని ఆయన కోరారు.