S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్మార్ట్‌పల్స్ సర్వేని అంకితభావంతో నిర్వహించాలి

చిత్తూరు, జూలై 21: ప్రజాసాధికారత సర్వేని అంకితభావంతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సర్వేపై జిల్లా అధికార యంత్రాగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వేవల్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నట్లు సమాచారం వస్తున్నదని, ఈఅపోహలు తొలగించాలని అన్నారు. అదనంగా అర్హులకు అనేక సంక్షేమ ఫలాలు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. దీనిపై పలుచోట్ల రకరకాలు వదంతులు వస్తున్నాయని వీటికి ఆదిలోనే చెరమగీతం పాడాలన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఈసర్వే ఉపయోగపడుతుందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పలుచోట్ల సంతృప్తికరంగా పురోగతి కనపడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక చోట్ల సర్వర్ సమ్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందిన తరుణంలో సర్వర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. ఇది క్షేత్ర స్థాయితో సమర్థవంతంగా జరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని తెలిపారు. ప్రతి రోజు సిబ్బంది లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్యాలు పూర్తయ్యేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకోవాలని ఆదేశించారు. సర్వర్ సమస్య వచ్చి నప్పుడు గ్రామాల్లో సర్వే పక్రియను కొనసాగించి అనంతరం వాటి వివరాలను పొందుపరచాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో దీని ప్రయోజనాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు. అప్పుడే ఇది సజావుగా కొనసాగుతుందన్నారు. అధికారుల మధ్య సమన్వయం అవసరమన్నారు. ముందుగా సర్వే నిర్వహించే ప్రాంతాల్లో దీని ప్రయోజనాలను వివరించితూ మంచి ఫలితాలు దక్కుతాయని ఈదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, డిఆర్‌ఒ విజయచందర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ రవిప్రకాష్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.