S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

24న మల్లెమాల సాహిత్య పురస్కారాలు

కడప,(కల్చరల్)జూలై 22: ఈనెల 24వ తేదీన ఆదివారం 3మల్లెమాల పురస్కార సంబరాల సభ2 నిర్వహిస్తున్నట్లు పురస్కార వ్యవస్థాపకులు డాక్టర్.మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, వరలక్ష్మి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ సభను స్థానిక పర్యాటకశాఖకు చెందిన హరిత హోటల్ ఫంక్షన్‌హాల్‌లో 24న ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరానికిగాను ప్రముఖ కథకులు పాలగిరి విశ్వప్రసాద్‌కు మల్లెమాల పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే 2015 సంవత్సరానికి గాను ప్రసిద్ద సాహితీ విమర్శకులు కాత్యాయని విద్మహేకి ప్రకటించామన్నారు. అని వార్యకారణాల వల్ల ఆ ఏడాది పురస్కార ప్రధానసభ నిర్వహించలేదని ఈ ఏడాది ఒకే రోజు 2016,2015 పురస్కారాల ప్రధానం ఈనెల 24వ తేది నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. 2009లో పెళ్లకూరు జయప్రదకు , 2010లో కొలకలూరు ఇనాక్‌కు , 2011లో పి.రామకృష్ణారెడ్డికి, 2012లో పి.సత్యవతికి, 2013లో కేతువిశ్వనాధరెడ్డి, 2014లో మధురాంతకం నరేంద్రకు మల్లెమాల సాహిత్య పురస్కారాలు అందజేసినట్లు వివరించారు. అదే క్రమంలో ఈ ఏడాది కాత్యాయని విద్మహే, పాలగిరి విశ్వప్రసాద్‌కు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ కథారచయిత సత్యాగ్ని హేక్ హుస్సేన్, ముఖ్యఅతిధిగా కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ది కథారచయిత ఆచార్య కేతువిశ్వనాధరెడ్డి, గౌరవ అతిధిగా సాహితీ కిరణం సాహిత్యమాస పత్రిక ఎడిటర్ పొత్తూరు సుబ్బారావులు హాజరౌతారన్నారు. పురస్కార గ్రహీతల పరిచయ ప్రశంసను ప్రసిద్దకథారచయిత ఆచార్య మధురాంతకం నరేంద్ర (కాత్యాని విద్మహే), ప్రముఖ కథారచయిత ఎన్.దాదాహైయ్యత్ (పాలగిరి విశ్వప్రసాద్)లు చేస్తారన్నారు. ప్రముఖ రచయిత్రి బి.ప్రతిమ నివేదిక సమర్పిస్తారన్నారు. కావున జిల్లాలోని సాహితీప్రియులు, కవులు, రచయితలు, కళాకారులు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.