S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కౌనె్సలింగ్ 25న మొదలయ్యేనా?

హైదరాబాద్, జూలై 22: ఈ నెల 25వ తేదీ నుంచి ఎమ్సెట్ మెడిసిన్ కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కాని ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజిపై సిఐడి దర్యాప్తు ప్రారంభం కావడంతో, మరో మూడు రోజుల్లో ఎమ్సెట్ మెడిసిన్ కౌనె్సలింగ్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో అలజడి నెలకొంది. 25న కౌనె్సలింగ్ ప్రారంభం కావాలంటే, తప్పనిసరిగా ఆలోగా లీకేజి జరగలేదని, అపోహ మాత్రమేనని సిఐడి తేల్చాల్సి ఉంది. సిఐడి అంత తొందరగా సున్నితమైన ఈ అంశాన్ని తేల్చుతుందా? ఒకవేళ తేల్చని పక్షంలో కౌనె్సలింగ్‌ను వాయిదా వేస్తారా? లీకేజి జరిగినట్లు ఆధారాలు దొరికితే, ఎమ్సెట్-2ను మళ్లీ నిర్వహిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మను రెండు రోజుల క్రితం ఎమ్సెట్ కన్వీనర్ రమణారావు కలిసి లీకేజిపై వచ్చిన అభియోగాలపై వివరాలు అందించారు. ఆ తర్వాత ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు, ఎమ్సెట్ నిర్వాహకులు పెదవి విప్పడం లేదు.ఎమ్సెట్-2లో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చే విధంగా ర్యాంకులు వచ్చిన వారి ఆర్థిక స్థితిగతుల వివరాలను కూడా సిఐడి సేకరిస్తోంది. సీటు పొందే అర్హత ఉన్న వారి జాబితాను తయారు చేసి వారి అకడమిక్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ కేంద్రాలుగా లీకేజి జరిగిందా అనే అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఎమ్సెట్-1లో అంత మంచిగా మార్కులు రాకపోయినా, ఎమ్సెట్-2లో ర్యాంకు వస్తే అనుమానించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది విద్యార్థులకు ఎమ్సెట్-1తో పోల్చితే ఎమ్సెట్-2లో 30కుపైగా మార్కులు అదనంగా వచ్చినట్లు సమాచారం.
అంతమాత్రాన వారి బ్రిలియన్సీని అనుమానించగలమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక విద్యార్థికి ఎమ్సెట్-2లో మొదటి 300లోపు ర్యాంకు వచ్చింది. అదే విద్యార్థికి ఎమ్సెట్-1లో 9వేల ర్యాంకు వచ్చింది. కాగా ఎమ్సెట్-2 లీకేజిపై సిబిఐతో విచారణ జరిపించాలని, సిఐడి దర్యాప్తు పట్ల తమకు నమ్మకం లేదని టిపిసిసి ప్రతినిధి మహేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఎంఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు.