S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంబేద్కర్ విగ్రహం సి-బ్లాక్‌లోనే ఏర్పాటయ్యేలా చూస్తాం

కడప,(కల్చరల్)జూలై 22: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం కడప కలెక్టరేట్‌లోని సి-బ్లాక్‌లో ఏర్పాటయ్యేలా కలెక్టర్ కెవి సత్యనారాయణతో మాట్లాడుతానని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) ప్రజాసంఘాలకు హామీ ఇచ్చారు. మహారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగటి మనోహర్ ఆధ్వర్యంలో శుక్రవారం 30 ప్రజాసంఘాలతో కూడిన ప్రతినిధి బృందం వాసుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అంబేద్కర్ అంటే అపారమైన గౌరవమని, అమరావతిలో 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని కడప కొత్తకలెక్టరేట్‌లో ఏర్పాటుచేస్తున్నట్లు జివో నెం 555ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రజాసంఘాలు అంబేద్కర్ విగ్రహం కోసం చాలాప్రయత్నాలు చేసిందని ప్రజల మనోభావాలు గౌరవించి సి-బ్లాక్‌లోనే ఏర్పాటుచేయాలని ప్రజాసంఘాల తరపున నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, మహారాజ్యం పార్టీ జిల్లా కన్వీనర్ మోటకట్ల పౌలయ్య, దళితనాయకులు ఏలియా, బండి జయశేఖర్, సిహెచ్ విజయబాబు, సంఘసేవకులు సయ్యద్ సలావుద్దీన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.శరత్‌బాబు, దళిత యునైటెడ్ ఫ్రంట్ రాష్టక్రన్వీనర్ డి.సాల్మన్, బిసి, దళిత సంఘాల నాయకులు నారాయణయాదవ్, జి.దానం, ఇరగదిండ్ల బాలవీరప్ప, ఎం.డేవిడ్, నాగేంద్రనాయక్, డి.శ్రీకృష్ణ, ఎన్.పెంచలయ్య, ఎ.రామ్మోహన్‌రావు, డా.శివనాయక్, ఎన్.విజయకుమార్, రామచంద్రయ్య, బి.రమణ, పుల్లయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.