S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యాలయాల్లో పర్యాటక క్లబ్బులు స్థాపించాలి

కడప,(కల్చరల్)జూలై 22:జిల్లాలోని విద్యాలయాల్లో పర్యాటక క్లబ్బులను స్థాపించడంతోపాటు పర్యాటక కేంద్రాలను ప్యాకేజి టూర్లతో అనుసంధానం చేయడంతో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు శిద్దవటం సీతారామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ కడప జిల్లా చరిత్రలో ఎంతో ప్రఖ్యాతి గాంచిందని, పర్యాటక రంగంలో జిల్లాకు సముచిత స్థానం ఇవ్వడంలోప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా మొదటి రెండు తెలుగుశాసనాలు కడప జిల్లాలోనే లభించాయన్నారు. పద సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యులు, ప్రపంచాన్నంతా అబ్బురపరచిన వేమన్న, భవిష్యత్ వాణిని ప్రవచించి మార్గదర్శకుడైన పోతులూరి వీరబ్రహ్మం, ప్రబంధ కవితకు జీవం పోసిన అల్లసానిపెద్దన, వసు చరిత్రకారుడు భట్టు మూర్తి ఈ జిల్లావారేనని ఆయన గుర్తు చేశారు. తెలుగు బాషకు ప్రాణం పోసిన బ్రౌన్ తన కార్యస్థానముగా చేసుకున్న జిల్లా ఇది అన్నారు. ఆయన వల్లనే తెలుగుబాష బ్రతికిందనేది కాదనరానిసత్యమన్నారు. 10వేల సంవత్సరాల నాడు జిల్లాలోని చింతకుంటలో అపూర్వమైన వర్ణరేఖా చిత్రాలను చిత్రించారని, ఆదిమానవులు రాయలసీమలోని ఏకైక బౌద్ధకేంద్రము నందలూరు ఉత్తర, దక్షిణ భారత దేశాలకు వారధిగా నిల్చిందని ఆయన గుర్తుచేశారు. ఆనాటి బౌద్ధమత తీపి గుర్తులు మహావీర్ మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయని చెప్పారు. కొండపై అపురూపంగా నిర్మించిన బౌద్ధ విహారాలు, ధ్యానానికి ఎదురుగా పిరమిడ్ ఆకారంలోని కొండ, కొండలోని బౌద్ధ విశ్రాంతి గుహలు స్నానఘట్టాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అలాగే జైనులు అపురూప శిల్పాలతో తీర్ణంకరుని విగ్రహాలతో నింపిన దానవులపాడు ఈ జిల్లాలోని ప్రత్యేక ఆకర్షణ అన్నారు. నేడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అందర్నీ ఆకర్షిస్తుండే అమీన్‌పీర్ పెద్దాదర్గా కడప నగరంలో నెలకొని ఉందని తెలిపారు. రాష్ట కూట చక్రవర్తులను ఆకర్షించటమే కాక, శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా ప్రసిద్ధి చెందిన పినాకినీ తీరంలోని జ్యోతి దేశంలోనే అపురూప క్షేత్రమన్నారు. జిల్లాలో మూడు అభయారణ్యాలున్నాయన్నారు. వీటిలో లంకమల, శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం, పెనుశిల అభయారణ్యం అన్నారు. ఇందులో అరుదైన పక్షులకు, జంతువులకు, కోనలకు, ఎన్నో దివ్యక్షేత్రాలకు , జలపాతాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందన్నారు. అరుదైన కలివికోడి సంచరించే ప్రాంతం లంకమల అన్నారు. అన్నమయ్యచే నిత్యం పూజలందుకుంటూ చిమ్మ చీకట్లో కూడా మిరుమిట్లు గొలుపుతూ 250 అడుగుల దూరానికి కూడా తన వెలుగులు విరచిమ్ముతూ ప్రకాశిస్తుండే నందలూరులోని సౌమ్యనాధ విగ్రహం దేశంలోనే అరుదైనదని పేర్కొన్నారు. అలాగే దక్షిణ, ప్రయాగగా, పంచనదీ సంగమంగా, దక్షిణ కైలాసంగా, రెండవ హంపిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఒకనాడు విశ్వవిద్యాలయ కేంద్రంగా ఏకైక శంకరాచార్య పీఠంగా ప్రసిద్ధిచెందిన పుష్పగిరి అపూర్వ శిల్పాలతో భూమాతకు మణిహారం సమర్పించిన దివ్యకేంద్రం మని, ఇది 108 ఆలయాలతో వెలసిన దివ్యక్షేత్రమన్నారు. అలాగే 18 అడుగుల ఎత్తయిన శివలింగం ఉన్న మహేంద్రగిరి, ఒంటిమిట్ట, గండికోట, రాయచోట వీరభద్రాలయం, సోమశిల, గండిక్షేత్రంతోపాటు జిల్లాలో అనేక ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం జిల్లా పర్యాటకంపై శ్రద్ధవహిస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.