S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆడపిల్లవమ్మా నీవు..!

రాజుపాళెం, జూలై 22: ఏ తల్లి కన్నబిడ్డనో ఆడ శిశువని నిర్దాక్షిణ్యంగా టంగుటూరు గ్రామం కుందూనది ఒడ్డున కంపచెట్లలో విడిచిన సంఘటన జరిగింది. సమాజంలో ఆడపిల్ల అంటే ఇప్పటికీ చిన్నచూపుగా పరిణమిస్తోంది. అమ్మాయిని పెద్దచేసి కట్నకానుకలు ఇచ్చుకొని ఓ ఇంటికి పంపుతామని, తమకు వారసునిగా మగపిల్లవాడు లేడని, వారిపై జాలి, కరుణ చూపడం లేదు. నవ మాసాలు మోసి, ఆడ శిశువును ప్రసవించిన ఆ కన్నతల్లికి ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా రక్తపు మరకలతో కుందూ ఒడ్డున కంపచెట్లలో వదిలివేయడంతో సభ్య సమాజం తలదించుకున్నట్లయింది. రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామం యానాదికాలనీకి చెందిన రాజు చేపల వేట కోసమని కుందూనదికి వెళ్లాడు. నదిలో చేపలు పడుతున్న తండ్రికి తోడుగా వెళ్లిన సురేష్ నది ఒడ్డున పసికందు అరుపులు వినిపించడంతో భయభ్రాంతికి లోనయ్యాడు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడవేసిన ఆడ శిశువు కనిపించింది. ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలివేసిన పసికందు సమాచారాన్ని సురేష్ తల్లికి చేరవేయడంతో ఆ పసికందును ఆమె అక్కున చేర్చుకుంది. సురేష్ తల్లి మలికీ పద్మావతికి ముగ్గురు కుమారులు కావడంతో ఆమెకు ఆడపాప లేకపోవడంతో దేవుడిచ్చిన బిడ్డగా ఆ పసికందును అక్కున చేర్చుకుంది. పసికందుకు కాళ్లూ, చేతులు వాపు వుండడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు ఆమె తెలిపింది.