S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్సీ, బీసీ హాస్టళ్ల మూసివేత తగదు

రాయచోటి, జూలై 22: ఎస్సీ, బీసీ హాస్టళ్లను ప్రభుత్వం ఎత్తివేస్తుండటం సరికాదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాయచోటి నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు, పేద వారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కొత్తగా ప్రభుత్వం హాస్టళ్లను మంజూరు చేయకపోగా, ఉన్నటువంటి వాటిని ఎత్తివేస్తుండటం అన్యాయమన్నారు. ఇటీవల సంబేపల్లె, లక్కిరెడ్డిపల్లెలలోని బీసీ హాస్టళ్లను ఎత్తివేయాలని ప్రయత్నిస్తే తాను జిల్లా కలెక్టర్‌తో చర్చించి విద్యార్థుల ఇబ్బందులను వివరించి ఆపడం జరిగిందన్నారు. మరి ఇప్పుడు చిన్నమండెంలో ఉన్న ఎస్సీ హాస్టల్‌ను ఎత్తివేయాలనడం సరికాదన్నారు. రెండు నియోజకవర్గాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రాయచోటికి పోస్ట్‌మెట్రిక్ చదివేవారు ఎక్కువగా వస్తున్నారని, వారి కోసం అదనంగా ఒక బీసీ బాలురు, ఒక బీసీ బాలికల హాస్టళ్లను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాలివీడు, చిన్నమండెం మండలాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, రాయచోటిలో హార్టికల్చర్ కళాశాల, జేఎన్‌టీయూను మంజూరు చేస్తే విద్యార్థులకు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయచోటి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే క్యాక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. అందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చిన్నమండెం ఎస్సీ హాస్టల్‌ను ఎత్తివేయకుండా కొనసాగించాలని ఆయన కోరారు.