S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉన్నత విద్యామండలి సలహాసంఘం సభ్యునిగా విష్ణురాజు

భీమవరం, జూలై 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సంయుక్తంగా రాష్ట్రంలో ప్రైవేటు రంగ సలహా సంఘాన్ని ఏర్పాటుచేసింది. విద్యాభివృద్ది కోసం ఏర్పాటుచేసిన ఈ సంఘం సభ్యునిగా విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ కలిదిండి వెంకట విష్ణురాజును ప్రభుత్వం నియమించింది. విద్యారంగం, పారిశ్రామిక రంగాల భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధలను పారిశ్రామిక సంస్ధల సమన్వయంతో విద్యావ్యవస్ధను మెరుగుపర్చడానికి ఈ సలహా సంఘం పని చేస్తోంది. ఈ సంఘంలోని 10 మంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, విద్యావేత్త కె.వి.విష్ణురాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్ దావ్రా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం ద్వారా మెరుగైనా విద్యావ్యవస్ధకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని విష్ణురాజు శుక్రవారం విలేఖర్లకు చెప్పారు.