S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ హామీలు అమలుపై క్షేత్రస్థాయ పరిశీలన

ఏలూరు, జూలై 22 : ప్రజా సంక్షేమం అభివృద్ధి అంశాలపై శాసనసభలో లేవనెత్తిన పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ ఛైర్మన్ పెందుర్తి వెంకటేష్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శాసనసభలో పలువురు సభ్యులు లేవనెత్తిన సమస్యలపై కేవలం అసెంబ్లీకే పరిమితంకావని, వాటి పరిష్కార తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. ప్రతీ జిల్లాకు వెళ్లి సంబంధిత అంశాలపై స్థానిక అధికారులతో సమీక్షించి వాటిలో అపరిష్కృతంగా వున్న అంశాలను సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి వారి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆయా జిల్లాల్లో సమావేశాల్లో చర్చించిన అంశాలను పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకూ వాటిని తొలగించడం జరగదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పది హామీలకు సంబంధించి ఏడు హామీలు పరిష్కారంపై సంతృప్తి వ్యక్తం చేశామని మిగిలిన మూడు హామీలను పెండింగ్‌లో ఉంచారన్నారు. వాటిపై తుది నివేదిక రాగానే తగుచర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న వివిధ అంశాలను శాసనసభ స్పీకరు దృష్టికి తీసుకెళతామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత శాసనసభకు సిబ్బంది కొరత తలెత్తిందని ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న శాసనసభలో తలెత్తిన వివిధ అంశాలను కూడా క్రోడీకరించి వాటిపై కూడా సమీక్షిస్తామన్నారు. శాసనసభలో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కమిటీ సభ్యులైన బాపట్ల ఎమ్మెల్యే కె రఘుపతి, మండపేట ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎఎస్‌పి చంద్రశేఖరరావు, డిఆర్‌వో కె ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.