S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్‌వికెఆర్‌కు జిఆర్‌ఇ, టోఫెల్ అనుమతి

భీమవరం, జూలై 22: విదేశాల్లో విదేశీ విద్యను అభ్యశించాలనుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. జిఆర్‌ఇ, టోఫెల్ పరీక్షా కేంద్రాన్ని భీమవరంనకు చెందిన వత్సవాయి కృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల (ఎస్‌వికెఆర్)కు విదేశీ విశ్వవిద్యాలయాల సమితి అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇప్పటి వరకు విశాఖపట్నంలో మాత్రమే ఉండే ఈ పరీక్షా కేంద్రం ఇప్పుడు ఎస్‌వికెఆర్‌లో ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని ఇది రెండవ కేంద్రమని చెప్పవచ్చు. ఆగస్టు 6వ తేదీ నుంచి స్లాట్‌లు బుకింగ్ చేసుకోవచ్చునని ఎస్‌వికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు వత్సవాయి శ్రీనివాసరాజు శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాన్ని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ల్యాబ్‌ను సిద్ధం చేశామన్నారు. సుమారు 190 దేశాల్లో 9వేల విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ విద్యను అభ్యశించవచ్చునన్నారు. వారికి ఇమ్మిగ్రేషన్, వర్క్ పర్మిట్‌కు అర్హత పొందవచ్చునని శ్రీనివాసరాజు తెలిపారు. డబ్లు డబ్లూ డబ్లూ డాట్ ఒఆర్‌జి టోఫెల్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించామని వివరించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఇదొక మంచి అవకాశమని ఆయన తెలిపారు. దీని ద్వారా అక్కడ విదేశీ విద్యను అభ్యశించడంతో పాటు వారికి ఉపాధి అవకావాలు మెండుగా లభిస్తాయన్నారు. సమావేశంలో కళాశాల టోఫెల్, జిఆర్‌ఇ బృందం పాల్గొన్నారు.