S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెంటాడుతున్న అనుమతి భయం

తాళ్లపూడి, జూలై 22: తాళ్లపూడి పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు ఛేపట్టేవారికి లే అవుట్ల అనుమతి భయం వెంటాడుతోంది. అన్ని పత్రాలు ఉన్నా అధికారులు ఏదో ఒక వంకతో నిర్మాణ పనులు నిలుపుదల చేస్తారోననే భయాన్ని ఎదుర్కొంటున్నారు. లే అవుట్ అనుమతి లేని స్థలంగా తాము గుర్తించామని, వెంటనే నిర్మాణాలు ఆపమని కొంతమందికి పంచాయతీ ఇటీవల నోటీసులు జారీచేసింది. ఒక వ్యక్తి సమాచార చట్టంలో పంచాయతీని నిర్మాణాలు, స్థలాలను గూర్చి సమాచారం కోరగా తాళ్లపూడి పంచాయతీ పరిధిలో లే అవుట్ల బాగోతాలు బట్టబయలయ్యాయి. దీనిపై నిర్మాణాలు పూర్తిచేసుకున్నవారికి సైతం పంచాయతీ నోటీసులు జారీచేసింది. 45/87 లే అవుట్ల అనుమతి ప్రకారం రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో నాలుగు నెలల క్రితం పంచాయతీ అనుమతి పొంది నిర్మాణం ప్రారంభించిన ఒక యజమానికి పంచాయతీ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలంటూ నోటీసు జారీచేసింది. లే అవుట్ అనుమతి పొందని స్థలాలుగా గుర్తించామన్నదే ఈ నోటీసుల జారీకి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏదైతే స్థలానికి అనుమతి లేదన్నారో అదే స్థలంలో రహదారి నిర్మిస్తున్నారు. ఇదేమిటని పంచాయతీ ఇఓ శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా అసలు రహదారి ఎవరు నిర్మిస్తున్నారో తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఆ రహదారికి కనీసం ప్రతిపాదనలు కూడా లేవని పంచాయతీరాజ్ ఇంజనీర్ వినోద్ తెలిపారు. అలాగే లే అవుట్ల అనుమతి లేని మరో ప్రాంతంలో భవన నిర్మాణాన్ని కూడా పంచాయతీ నిలుపుదల చేయించింది. భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయడంలో మొదట్లో నిర్లక్ష్యం వహించి..ఆపై నోటీసులు జారీచేసి చేతులు దులుపేసుకుంటుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా హైటెన్షన్ వైర్లు భవన శ్లాబ్ కింద నుండి వెళ్లేలా ఒక భవన నిర్మాణం జరుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు.
కాగా ఇటీవల పెంచిన ఇంటి పన్నుల విషయంలో కూడా పంచాయతీ విమర్శలకు గురైంది. ఏ విధంగా పన్నులు విధించారో ప్రజలకు తెలియజెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఇవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను పంచాయతీకి బదిలీపై వచ్చి కొద్ది కాలం మాత్రమే అయిందని, వీటిని పరిశీలించవలసి ఉందన్నారు. పంచాయతీలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.