S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధి పనులు చేస్తే శే్వతపత్రం ఎందుకు?

విజయనగరం (్ఫర్టు), జూలై 22: పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తే అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. అభివృద్ధి పనులకు తమవద్ద రికార్డులు ఉన్నాయని, వాటిని పరిశీలించవచ్చునని చెప్పారు. శుక్రవారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పట్టణాన్ని సర్వనాశం చేసిన నాయకులు ఇప్పుడు అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఉంటూ అభివృద్ధి నిరోధకులుగా తయారైన నాయకులు ఇప్పుడు వైకాపాలో చేరి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో 35 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశామని, అయితే వైకాపా నేతలకు అభివృద్ధి కనిపించడంలేదని, మతిభ్రమంచి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వైకాపా నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్లే పట్టణ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గడపగడపకూ తిరుగుతూ లేనిపోని విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీల నేతల మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు మైలపిల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు, టిడిపి నాయకుడు ఆల్తి బంగారుబాబు పాల్గొన్నారు.