S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏళ్లు గడుస్తున్నా ఆర్టీసీ సేవలు అందవా?

గజపతినగరం, జూలై 22: మండలం లో రహదారులు బాగున్నా ఆర్టీసీ సేవ లు మాత్రం అన్నిగ్రామాలకు అందడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధు లు, అధికారులు పట్టించుకోవడం లే దు. మండలంలో 28 పంచాయతీలు, ఏ డు మధుర గ్రామాలు కలిపి 35 పం చాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల ను ంచి ప్రతిరోజు ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్న త చదువులకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు బస్సులు లేక సైకిళ్లపై విద్యార్థులు వస్తున్నారు. ఏ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం తో విద్యార్థులతోపాటు కూలీలు, మహిళలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 28 పంచాయతీలలో బంగారమ్మపేట, భూదేవిపేట, బూడిపేట, దావాలపేట, గుడివాడ, వేమలి గ్రామాలకు మట్టిరోడ్లు ఉన్నాయి. మిగిలిన అన్ని గ్రా మాలకు తారురోడ్డు సదుపాయం ఉం ది. అయినా ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యంలేదు. ఆర్టీసీ పేద ప్రజలకు, విద్యార్థులకోసం సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా గజపతినగరం ప్రాంతంలో నీటిపై రాతలుగా మిగిలా యి. కొన్ని ప్రాంతాలలో రెండు ప్రైవేటు బస్సులు ప్రయాణీకులకు చేదోడుగా ఉంటున్నాయి. దీనివలన ప్రభుత్వానికి రావల్సిన ఆదాయవనరులు ప్రైవేటు ప రం అవుతున్నాయి. ఒకటో తరగతి ను ంచి పదవ తరగతి వరకు బాలికలకు ఉ చితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రకట న చేసిందని, మండలంలో అమలు కావడంలేదు. ఆర్టీసీ బస్సు లేనందునే సం క్షేమ పథకాల లబ్ధి కొంతమందికి చేరుతున్నాయి. జన్మభూమి సభలో సాలిపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే నాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. రవాణా శాఖ అధికారులతోపాటు మంత్రితో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే నాయుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడంతో గ్రా మస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.