S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాట్లు

నెల్లిమర్ల, జూలై 22: నేరాలను నియంత్రించడానికి పోలీసు శాఖ వినూత్న ప్రయోగాలు చేస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్లు, వైన్ షాపులలో యజమానులే స్వచ్ఛంధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. రామతీర్థం జంక్షన్‌లో మూడు, మొయిద జంక్షన్‌లో మూడు సిసి కెమెరాలు ప్రస్తుతం ఏర్పాటు చేశారు. మిమ్స్ మెయిన్ గేటువద్ద రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి చెప్పనున్నట్లు ఎస్సై ఉపేంద్రరావు చెప్పారు. పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు వలన నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సిసి కెమెరాలు తక్కువ కాంతిలో కూడా పనిచేస్తాయని, ఫలితంగా చోరీలకు పాల్పడిన వారిని సులువుగా అదుపులోకి తీసుకోవడానికి వీలు అవుతుందని అన్నారు. జరజాపుపేట, సతివాడ వైన్ షాపుల యజమానులకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రివేళల్లో ప్రమాదాలు చేసి తప్పించుకుని వెళ్లిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయడానికి సిసి కెమెరాలు ఉపకరిస్తాయి. ఎటిఎంలు చోరీలకు పాల్పడిన వ్యక్తులను సులువుగా గుర్తించే అవకాశం ఉంది. నెల్లిమర్ల జూట్‌మిల్లు వద్ద, చంపావతి నది వంతెన వద్ద కూడా సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తే ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.