S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలవరం పనులు బంద్

పోలవరం, జూలై 22: రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకంగా భాసిల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ కార్మికులు సమ్మెకు దిగడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శుక్రవారం నుండి నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టు ఏజన్సీలో పనిచేస్తున్న పొక్లయినర్లు, డంపర్ల డ్రైవర్లతోపాటు సూపర్‌వైజర్లు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగారు. దీనితో ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన స్పిల్‌వే ప్రాంతంలో రోజుకు 25వేల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనులు నిలిచిపోయాయి. ఈ నెల 20 నుంచి జీతాలు చెల్లించాలని ఆందోళన చేస్తున్నా పనులు యథావిథిగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం మాత్రం వారంతా పనులు నిలిపివేశారు. కాంట్రాక్టు ఏజన్సీలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 500మంది పనిచేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు గత మూడు నెలలుగా ఒక్క రూపాయి కూడా పంపించలేకపోతున్నామని, దాంతో భార్యపిల్లలు పస్తులుండవలసిన దుస్థితి నెలకొందని కార్మికులు వాపోయారు. తమ వేతనాల బకాయిలు చెల్లిస్తే, ఇక్కడ పని మానివేసి తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని వారంతా పేర్కొంటున్నారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోతోందన్నారు. ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులకు ఫోనుచేసినా ఎవరూ స్పందించలేదని వారు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా మూడు నాలుగు నెలలకు జీతాలు ఇవ్వని కారణంగా ఆందోళన చేసిన కార్మికులకు జీతాలు చెల్లించిన వెంటనే వారు తిరిగి విధుల్లోకి చేరేవారు. ఇదిలా ఉండగా వేరే ప్రాంతంలో మట్టి పనులు నిర్వహిస్తున్న త్రివేణి కాంట్రాక్టు సంస్థ పనులు యథావిథిగా జరుగుతున్నాయి.

పనులు నిలిపివేసి, ఆందోళనకు దిగిన కార్మికులు