S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీసు శాఖలో 6 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

విజయవాడ, జూలై 22: గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతోపాటు కేంద్ర ద్వారా చట్ట సంస్కరణ తీసుకువచ్చి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. గత రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పోలీసుశాఖ ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు. తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఏపి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు బోర్టుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. డిజిపిగా రాముడు ఈ నెల 23వ తేదీ శనివారం పదవి విరమణ కానున్నారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసుశాఖ ఖాళీల భర్తీ గూర్చి ఆయన వివరిస్తూ రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళయినా.. పోలీసుశాఖకు సంబంధించి ఇంకా విభజన పూర్తి కాలేదని, చాలా ఖాళీలు ఉన్నాయని, సుమారు 14వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అనుమతి మేరకు తొలిదశలో ఆరువేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఎంపికలో ఎస్‌ఐల నియామకానికి తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు. ఐదు కిలోమీటర్ల పరుగు పోటీని తొలగించి ఒక మైలు దూరానికి కుదించామని, అదేవిధంగా శారీరక దారుఢ్య పరీక్షల్లో ఐదు అంశాల్లో మూడు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని, ఐపిఎస్ ఎంపిక విధానం తరహాలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆ తర్వాత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్ధులు ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వరకు 40రోజుల్లోగా వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, పదిరోజుల్లో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడు చేసుకోవచ్చు.

పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న డిజిపి రాముడు