S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థ పటిష్ఠం

విజయవాడ, జూలై 22: పోలీస్... ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నది తన అభిమతమని, అలాగే సమాజంలో పోలీస్ ఇమేజ్ పెంపుకోసం పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ దశలవారీగా సంస్కరణలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇన్‌ఛార్జి డిజిపిగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్న నండూరి సాంబశివరావు అన్నారు. తగినన్ని వనరులు అందుబాటులో లేనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, మారుతున్న కాలానుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిల్లోనూ జోడించనున్నామన్నారు. గత గోదావరి పుష్కరాలలో ఎదురైన అనుభవాలనే పాఠాలుగా తీసుకుని ముందుకు సాగనున్నామన్నారు. కృష్ణాతీరానికి రెండు వైపులా ఉన్న స్నానఘట్టాలు, అలాగే ప్రార్థనా మందిరాలు, ఇతర కూడలి ప్రాంతాల్లోనూ ఎక్కడ కూడా ఏ సమయంలోనూ రద్దీ అనేది లేకుండా చూడటంకోసం బందోబస్తులో నున్న పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే ప్రయాణికులు, యాత్రికుల అవసరాలకు తగ్గట్లు బస్సులను నడపాల్సి ఉందన్నారు. పుష్కరాలు జరిగే కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలు 33 వేల మంది పోలీసులతో రోజుకు మూడు షిప్టులతో బందోబస్తు విధులు నిర్వర్తించేలా తగు ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. ఆర్టీసీలో ఈ విధమైన వెసులుబాటు కల్పించి సత్ఫలితాలను రాబట్టగల్గామన్నారు. రాత్రి పగలు పనిచేసే పోలీసుల సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించగలనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజలు పోలీసులను, అలాగే పోలీసులు ప్రజలను గౌరవించేలా ఒకరిపై మరొకరు నమ్మకం, విశ్వసం ప్రోది చేసుకునేలా కృషి చేస్తానన్నారు. నేరాల నివారణకు అలాగే నేర పరిశోధనలకు తగు సమాచార సేకరణకు సాధారణంగా స్వల్ప సంఖ్యలో ఉన్న ఎస్‌బిఐ, ఇంటలిజన్స్ ద్వారా, పరోక్షంగా నిర్దేశిత ఇన్‌ఫార్మర్ల తోడ్పాటు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాకాకుడా ప్రజలందరిని ఇన్‌ఫార్మర్లుగా మార్చినపుడే పోలీస్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో తన 32 ఏళ్ల సర్వీసులో ఎన్నో పదవులు, బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఆర్టీసీలో విధులు తనకి ఎంతో సంతృప్తి కల్గించాయని నండూరి సాంబశివరావు అన్నారు.