S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలవంతంగా భూములు సేకరించొద్దు

హైదరాబాద్, జూలై 22: రైతుల నుంచి ఏకపక్షంగా, బలవంతంగా భూములు సేకరించరాదని తెలంగాణ రెవెన్యూ అధికారులను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది. రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం ద్వారా వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లవుతుందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు రూ. 6 లక్షల సొమ్ము చెల్లించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొంది. తమ పూర్వీకులు పొలం మీద తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా రెవెన్యూ అధికారులు తమ భూములను తీసుకుని వేలం వేయడాన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన 32 మంది రైతులు 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పూర్వీకులు 1958లో వ్యవసాయ ఇన్‌పుట్స్ నిమిత్తం రుణాలు తీసుకున్నారని వారు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మెదక్ జిల్లా కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం వద్ద సవాలు చేశారు. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బోసలే విచారించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూమి తమకు అవసరమని పేర్కొంటూ రెవెన్యూ శాఖ రైతుల భూములను తీసుకోవడానికి వీలులేదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ రైతులు ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నారని, రుణాలు చెల్లించలేదని, అందుకే ప్రభుత్వానికి ఈ భూమిని తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది దుర్గారెడ్డి వాదనలు వినిపిస్తూ, రైతుల పూర్వీకులు రుణాలను చెల్లించలేదని, దీంతో భూములను ప్రభుత్వ భూములుగా మార్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రైతులు రుణం తీసుకున్నట్లుగా, ఇంకా బాకీ ఉన్నట్లుగా రికార్డులు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులే తమ భూములకు నిజమైన యజమానులని, అంతగా కావాలంటే రైతులు తీసుకున్న రుణం రూ. 200కు వడ్డీతో కలిపి చెల్లించాలని రెవెన్యూ శాఖ కోరవచ్చని హైకోర్టు పేర్కొంది.