S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరాశాజనకంగా తాండవ జలాలు

కోటనందూరు, జూలై 24: తూర్పు, విశాఖ జిల్లాల్లోని మెట్ట భూములకు సాగునీరందించే తాండవ జలాశయం నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన తప్పడంలేదు. నీటి విడుదల సమయం సమీపిస్తున్నా నీటి మట్టం పెరుగుదలలో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ఇందుకు ప్రధాన కారణం జలాశయం పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే. తూర్పు, విశాఖ జిల్లాల్లోని 51,456 ఎకరాలకు సాగునీరందించే తాండవ జలాశయం పూర్తి నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 355.50 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 359.70 అడుగులు ఉంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో ప్రతిరోజు 50 ఎంసీ ఎఫ్‌టీలు మాత్రమే ఉంది. ఈ జలాశయానికి విశాఖ ఏజన్సీలోని చింతపల్లి, గూడెం కొత్తవీధి, గొలుగొండ మండలాల్లో కురిసే వర్షాల వల్ల వచ్చేనీరు చేరుతుంది. అయితే ఈ ఏడాది విశాఖ ఏజన్సీ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేని కారణంగానే జలాశయంలో నీటి చేరిక తక్కువగా ఉందని రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది తాండవ నీటిని ఆయకట్టుకు ఆగస్టు మొదటి వారం లేదా రెండోవారంలో విడుదల చేయడం అనవాయితీగా వస్తోంది. నీరు విడుదల చేయాలంటే జలాశయంలో నీటి మట్టం కనీసం 360 అడుగులకు మించి ఉండాలి. పరీవాహక ప్రాంతంలో ఇదే పరిస్థితి కొనసాగితే నీటి విడుదల ఆగస్టు రెండోవారంలోనైనా చేయడం కష్టమే. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఆశించిన ఆయకట్టు రైతులు ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేశారు. నారుమళ్లు సిద్ధంగా ఉన్నా సాగుకు అవసరమైన నీరు అందే అవకాశం దరిదాపుల్లో కానరాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు కురిస్తేనే తమ సాగునీటి కష్టాలు తీరుతాయని ఖరీఫ్ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.