S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్ధృతంగా ఏలేరు కాలువ

సామర్లకోట, జూలై 24: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సామర్లకోటలో వున్న ఏలేరు కాలువలో వరద నీటి ఉద్ధృతి బాగా పెరిగింది. నిత్యం పరిశ్రమల వ్యర్థ జలాలతో దర్శనం ఇచ్చే ఏలేరు కాలువలో వరద నీటి ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. పెద్దాపురం పైనున్న మెట్ట ప్రాంతాల్లో జోరుగా కురిసిన వర్షం నీరు కిందకు వస్తోంది. దాంతో వరద నీటి ప్రవాహం ఏలేరు కాల్వకు పెరిగింది. స్థానిక ఉప్పువారి సత్రం వద్దనున్న స్లూయిజ్‌ల నుండి ఏలేరు కాలువకు జోరుగా నీరు ప్రవహిస్తోంది. కాగా శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ధాటికి స్థానిక 30వ వార్డు సాయినగర్‌కు చెందిన గనె్నం కొండమ్మ తాటాకిల్లు తెల్లవారుజామున అందరూ నిద్రలో వుండగా కుప్ప కూలింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు ఆవ్వలేదు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామం వద్ద చెరకు తోట వర్షం నీటితో ముంపునకు గురైంది. ఆదివారం కూడా తేలికపాటి జల్లులు కురిశాయి.