S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పునాదుల్లోనే కునారిల్లుతున్నాయ

అమలాపురం, జూలై 24: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల లాభేపేక్ష తూట్లు పొడుస్తోంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, వౌలిక సదుపాయాల కల్పనకు సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా వాటిని వినియోగించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో మంజూరు చేసిన భవనాల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదంటే సంబందిత శాఖ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. అమలాపురం రూరల్ మండలంలో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 34 అదనపు తరగతి భవనాలకు, మున్సిపాలిటీలోని పాఠశాలలకు సంబంధించి 15 భవనాలకు ఒక్కొక్క తరగతికి రూ.5.8 లక్షలు కేటాయించింది. నిధులు మంజూరైన మూడు నెలల్లో భవన నిర్మాణాలు పూర్తిచేయాలని ఎస్‌ఎస్‌ఎ నిబంధన. అయితే నేటికీ 80 శాతం పాఠశాలల్లో పనులు పూర్తికాలేదు. కొన్ని నిర్మాణాలైతే పునాదుల్లోనే నిలిచిపోయాయి. భట్నవిల్లిలోని పాఠశాల భవనం పునాదిలోనే నిలిచిపోయింది. దీంతో అక్కడ అద్ధ్భెవనంలో విద్యాభోదన సాగిస్తున్నారు. ఇక్కడ ఇంకోవిషయం ఏమిటంటే ఈభవన నిర్మాణాలను రాజకీయంగా పట్టున్న నాయకులు చేజిక్కించుకుని చేసిన పనికి పైబడి నిధులు మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సంబందిత ఇంజనీరింగ్ అధికారులు రాజకీయ నాయకులతో తమకెందుకులే అన్నచందంగా వారు ఎలా చెబితే అలా బిల్లులు చెల్లించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అసంపూర్తి భవన నిర్మాణాలపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి తక్షణమే పూర్తి చేయాలని తల్లితండ్రులు కోరుతున్నారు.
ఎస్‌ఎస్‌ఎ ఎఇ చక్రధరరావు వివరణ: ఇసుక కొరత కారణంగా 2014-15లో మంజూరైన భవనాల నిర్మాణాల్లో జాప్యం జరిగి నిధులు వెనక్కు వెళ్ళిపోయిన కారణంగా కొన్ని భవనాలు మద్యలో నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. వెనక్కు వెళ్ళిన నిధులు తిరిగి రప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని, అసంపూర్తి భవనాలన్నింటినీ రెండు నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు.